టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లోకి ప్రవేశించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడలోకి ప్రవేశించింది. ప్రకాశం బ్యారేజీ మధ్యలో నారా లోకేష్‌కి ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇటు ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలు లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలలతో లోకేష్‌ని సత్కరించారు. లోకేష్ పాదయాత్రలో విజయవాడ ఎలక్ట్రికల్ వర్కర్స్ ప్రతినిధులు ఆయన్ని కలిశారు. విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద ఎలక్ట్రికల్ వర్కర్లు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా7,895మంది గ్రేడ్-2 జూనియర్ లైన్ మెన్లుగా 2019 అక్టోబర్ లో విధుల్లో చేరామని.. 2సంవత్సరాలు ప్రొవిజన్ కాలం ముగిసినా మమ్మల్ని రెగ్యులర్ చేయలేదని లోకేష్‌కి తెలిపారు. ఎలక్ట్రికల్ వర్కర్ల సమస్యలపై నారా లోకేష్ స్పందించారు. మాటతప్పడం, మడమతిప్పడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతోపెట్టిన విద్యని.. తమ న్యాయమైన డిమాండ్లకోసం పోరాడే ఉద్యోగులపై జగన్ ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేనివిధంగా అణచివేత చర్యలకు పాల్పడుతోందన్నారు. జూనియర్ లైన్ మెన్ల సమస్యలకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. వారు పరిష్కరించకపోతే టిడిపి ప్రభుత్వం వచ్చాక సమస్యలను పరిష్కరిస్తామని వర్కర్లకు హామీ ఇచ్చారు.
Yuvagalam : జనసంద్రమైన బెజవాడ.. లోకేష్‌కి ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు

Yuvagalam