టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్రకు భారీగా జనం తరలివస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గంలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. దర్శి నియోజకవర్గంలో ప్రజలు నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో జనం మీద పడటంతో లోకేష్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. లోకేష్‌ని కలిసేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడంతో తోపులాట జరిగింది ఈ తోపులాటలో మూడుసార్లు లోకేష్ కింద పడబోయాడు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తంతో లోకేష్‌కి ప్రమాదం తప్పింది. తోపులాటలో తరచుగా లోకేష్ చేతులు, కాళ్ళకి గాయాలు అయ్యాయి. క్రౌడ్ మ్యానేజ్మెంట్ లో తరచూ పోలీసులు విఫలమవుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు కావాలనే లోకేష్‌కి భద్రత కల్పించకుండా వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ పెద్దల ఒత్తిడి మేరకే లోకేష్ పాదయాత్రకి భద్రత తగ్గింపని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కందుకూరు, గుంటూరు చంద్రబాబు సభల్లో మాదిరిగానే దుర్ఘటన జరిగేలా వైకాపా కుట్ర పన్నుతోందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
Yuvagalam : యువగళం పాదయాత్ర లో నారా లోకేష్ కు తప్పిన ప్రమాదం

Yuvagalam