Nara Lokesh: నేడు నంద్యాలలో లోకేష్ పర్యటన

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగలం పేరుతో ఇప్పటికే ఆయా నియోజకవర్గాలను చుట్టేశారు. అందులో భాగంగా ఏఈ రోజు ఆయన నంద్యాలలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచుతున్నాయి. టీడీపీ, జనసేన ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగలం పేరుతో ఇప్పటికే ఆయా నియోజకవర్గాలను చుట్టేశారు. అందులో భాగంగా ఈ రోజు ఆయన నంద్యాలలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

We’re now on WhatsApp : Click to Join

నారా లోకేష్ గురువారం రాత్రి 11.30 గంటలకు నంద్యాలకు చేరుకుని ఎస్‌ఎన్‌ ఫంక్షన్‌ హాల్‌లో బస చేయగా శుక్రవారం ఉదయం పార్టీ నేతలతో మాట్లాడి అనంతరం ఎస్‌ఎన్‌ ఫంక్షన్‌ హాల్‌ నుంచి రాణి మహారాణి థియేటర్‌లోని బహిరంగ సభ వరకు రోడ్‌షోలో పాల్గొంటారు. ఎన్టీఆర్ నగర్ సమీపంలో సాయంత్రం యువ గళం సభలో లోకేష్ పాల్గొని ప్రసంగిస్తారు. కాగా నిన్న గురువారం చంద్రగిరిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకి ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పార్టీ జెండాలతో తొండవాడ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.

Also Read; Cold Drinks Side Effects: కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగిన స‌మ‌స్య‌లేన‌ట‌..!

  Last Updated: 03 May 2024, 10:25 AM IST