Nara Lokesh:వ‌స్తున్నాడు..లోకేష్‌.! వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రూపంలో.!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ చేతికి ఆ పార్టీ కీల‌క ప‌గ్గాల‌ను అప్ప‌గించ‌డానికి రంగం సిద్ధం అవుతోంది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్ర‌క‌టించ‌డానికి స‌రైన స‌మ‌యాన్ని ఆ పార్టీ అధిష్టానం చూస్తోంది. వ‌చ్చే ఏడాది ప‌దోన్న‌తి క‌ల్పించాల‌ని యోచిస్తున్న‌ట్టు అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

  • Written By:
  • Updated On - December 14, 2021 / 10:14 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ చేతికి ఆ పార్టీ కీల‌క ప‌గ్గాల‌ను అప్ప‌గించ‌డానికి రంగం సిద్ధం అవుతోంది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్ర‌క‌టించ‌డానికి స‌రైన స‌మ‌యాన్ని ఆ పార్టీ అధిష్టానం చూస్తోంది. వ‌చ్చే ఏడాది ప‌దోన్న‌తి క‌ల్పించాల‌ని యోచిస్తున్న‌ట్టు అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. చాలా కాలంగా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌విని అప్ప‌గించ‌బోతున్నార‌ని టాక్ ఉంది. కానీ, ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవడంతో చంద్ర‌బాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
కాబోయే సీఎంగా ఇప్పటికే లోకేష్ ను చాలా మంది పార్టీలోని కీల‌క లీడ‌ర్లు ఫోక‌స్ చేస్తున్నారు. మంత్రిగా ఉన్న‌ప్పుడే ఆ నినాదాన్ని వినిపించారు. ఇప్పుడు మ‌ళ్లీ కాబోయే సీఎం లోకేష్ అంటూ వ్యూహాత్మ‌కంగా ప్ర‌జా క్షేత్రంలోకి తీసుకెళ్ల‌డానికి స్కెచ్ వేస్తున్నారు. అందుకే, సంస్థాగ‌తంగా ప‌దోన్న‌తి క‌ల్పించ‌డం ద్వారా ఆ స్కెచ్ కు ప‌దును పెట్టాల‌ని పార్టీలోని కీల‌క లీడ‌ర్లు భావిస్తున్నారు.
ఇటీవ‌ల మాస్ లీడ‌ర్ గా లోకేష్ ఫోక‌స్ అయ్యాడు. ఆ మేర‌కు క్యాడ‌ర్ సంతోష పడుతోంది. ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌న పోరాడిన తీరుపై త‌మ్ముళ్లు సంతృప్తిగా ఉన్నార‌ని పార్టీ అంచ‌నా వేస్తోంది. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స‌ర్కార్ మీద ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తూ లీడ‌ర్ గా ప్ర‌త్యేక గుర్తింపును పొందాడు. ఒక‌ప్పుడు లోకేష్ ను ప‌ప్పు అన్న వాళ్లు కూడా ఫైట‌ర్ అంటున్నారు. దీంతో ఇదే మంచి స‌మ‌యంగా భావిస్తూ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ను చేయాల‌ని ఆయ‌న అభిమానుల్లో ఉంది.
వ‌చ్చే ఏడాది లోకేష్ చేత పాద‌యాత్ర చేయించాల‌ని పార్టీలోని కొంద‌రు కోర్ టీం కోరుకుంటున్నారు. క్యాడ‌ర్ తో శ‌భాష్ అనిపించుకుంటోన్న ఆయ‌న ప్ర‌జ‌ల వ‌ద్ద కూడా ప్ర‌శంస‌ల‌ను పొంద‌డానికి ప్లాన్ చేస్తున్నారు. గ‌తంలో వైఎస్ ప్ర‌భుత్వం మీద పాద‌యాత్ర చేయ‌డం ద్వారా చంద్ర‌బాబు విజ‌య‌వంతం అయ్యాడు. ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స‌ర్కార్ ను దింపాలంటే లోకేష్‌తో పాద‌యాత్ర చేయించాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు.
ఉగాది త‌రువాత ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు లోకేష్ పాద‌యాత్ర రూపంలో వ‌స్తాడ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆయ‌న మాత్రం పార్టీ అధిష్టానం ఎలా ఆదేశించినా..చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాడు. బ‌స్సు యాత్ర చేయ‌మ‌న్నా, సైకిల్ యాత్ర లేదా పాద‌యాత్ర ..దేనికైనా ఆయ‌న రెడీ గా ఉన్న‌ట్టు అనుచ‌రులు చెబుతున్నారు. అందుకు మాన‌సికంగా కూడా ఆయ‌న సిద్ధం అయిన‌ట్టు తెలుస్తోంది.
సంస్థాగ‌తంగా పార్టీని ప్ర‌క్షాళ‌న చేయ‌డానికి చంద్ర‌బాబు ఇటీవ‌ల పూనుకున్నాడు. ఆ క్ర‌మంలోనే నెల్లూరుకు చెందిన ఇద్ద‌రు కార్పొరేట‌ర్ల‌ను కోవ‌ర్ట్ లుగా భావిస్తూ బహిష్క‌రించాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి బ‌హిష్క‌ర‌ణ‌లు చాలా ఉంటాయ‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వాళ్ల‌కు ఇక చోటు ఉండ‌ద‌ని సంకేతం ఇచ్చేశాడు. పూర్తి స్థాయి ప్ర‌క్షాళ‌న చేసిన త‌రువాత లోకేష్ పాద‌యాత్ర‌కు వెళాతార‌ని తెలుస్తోంది. బ‌హుశా వ‌చ్చే ఏడాది ఉగాది త‌రువాత ఏ రోజైనా యాత్ర‌కు శ్రీకారం చుట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.