Election Results 2024: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాల లోకేశ్ మంగళగిరిలో విజయఢంకా మోగించారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి లావణ్యపై గెలిచారు. దీంతో టీడీపీ దశాబ్ధాలుగా గెలవని మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగరేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచింది. 1985లో చివరిగా గెలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకూ అక్కడ గెలవలేదు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక, 2019లో లోకేశ్ పోటీ చేసి ఓడినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండటం ఇప్పుడు ఆయనకు కలిసొచ్చింది. అలాగే నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనపై ప్రజల్లో సానుకూలతను పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also: AP & TG Election Results Live Updates : ఏపీ అంత పసుపు మయం
మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వెంకట లక్ష్మీ నరసింహరాజుపై 56,777 ఓట్ల భారీ మెజారిటీతో విజయదుందుభి మోగించారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి 60,125 ఓట్లు రాగా, ఆర్ఆర్ఆర్‌కు 1,16,902 ఓట్లు వచ్చాయి.