రాజకీయ నేతలు చాలామంది మాట ఇచ్చి మరచిపోతుంటారు..కానీ కొంతమంది మాత్రమే ఇచ్చిన మాటపై కట్టుబడి ఉంటారు. అలాంటి కొందరిలో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఒకరు. సమస్య ఏదైనా కానీ క్షణాల్లో ఆ సమస్యను తీర్చడం నారా లోకేష్ స్టయిల్. వేదిక ఏదైనా సరే అన్న మాకు ఈ కష్టం ఉంది అని చెప్పిన వెంటనే ఆ కష్టం నుండి వారిని బయటపడేస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడే కాదు అధికారం లేని సమయంలో కూడా ప్రజల సమస్యలను తీర్చి అందరివాడు అయ్యాడు. తాజాగా విద్యార్థుల సమస్యను గంటలోనే నెరవేర్చి దటీజ్ లోకేష్ అనిపించుకున్నాడు.
శనివారం విజయవాడ పాయకాపురం (Naralokesh Payakapuram) జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం (Mid Day Meal) ప్రారంభ కార్యక్రమానికి హాజరైన నారా లోకేష్‌ను, రమ్య అనే విద్యార్థిని కాలేజీ వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరింది. రాత్రి వేళ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్య అవసరమని ఆమె పేర్కొంది. లోకేష్ ఈ అభ్యర్థనపై తక్షణమే స్పందించి, సాయంత్రం కల్లా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవడంపై అక్కడి విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,48,419 మంది ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు నారా లోకేష్ చొరవ చూపారు. ఈ పథకం జనవరి 4 నుంచి అమలులోకి వచ్చింది. పాఠశాలలతో అనుసంధానమైన కాలేజీలలో భోజనం తయారీని నిర్వహించగా, ఇతర కాలేజీల కోసం కేంద్రీకృత వంటశాలలను ఏర్పాటు చేశారు. ఈ పథకం దూర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో సౌలభ్యం కల్పించింది.
అలాగే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తులపై దోపిడీ జరిగినట్లు నారా లోకేష్ దృష్టికి రావడంతో, వెంటనే దేవాదాయ శాఖను అప్రమత్తం చేసి చర్యలు చేపట్టించారు. ఈ ఘటనలో ఆలయ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని, సంబంధిత ఉద్యోగిని విధుల నుంచి తొలగించడం జరిగింది. ప్రజల సమస్యల పట్ల ఆయన తీసుకునే తీరు ప్రశంసనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. నారా లోకేష్ సమస్యలను తక్షణమే పరిష్కరించడంలో తన ప్రత్యేకతను నిరూపిస్తున్నారు. చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద సమస్యల వరకు అన్ని విషయాల్లో తక్షణ స్పందనతో ప్రజల వద్ద భరోసా పెంచుతున్నారు.
Read Also : HYDRA : మాదాపూర్‌లో 6 అంతస్తుల అక్రమ భవనాన్ని కూల్చివేతకు హైడ్రా సిద్ధం