Nara Lokesh : శ్రీశైలం మల్లన్న ను దర్శించుకున్న నారా లోకేష్ కుటుంబ సభ్యులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)ఈరోజు గురువారం శ్రీశైలం మల్లన్న (Srisailam Temple)ను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయం వద్ద లోకేశ్‌తో పాటు ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. తొలుత సాక్షి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. […]

Published By: HashtagU Telugu Desk
Lokesh Srishailam

Lokesh Srishailam

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)ఈరోజు గురువారం శ్రీశైలం మల్లన్న (Srisailam Temple)ను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయం వద్ద లోకేశ్‌తో పాటు ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. తొలుత సాక్షి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధినేత చంద్రబాబు తో పాటు టీడీపీ నేతలంతా ఎన్నికల్లో బిజీ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి చెందడం తో ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని కసిగా ఉన్నారు. లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేస్తుంటాడు. ఇక జనసేన తో పొత్తు పెట్టుకున్న టీడీపీ..ఎన్నికల బరిలో కలిసి పోటీ చేయబోతున్నారు. ఇప్పటీకే అభ్యర్థుల టిక్కెట్ల విషయంలో చర్చలు నడుస్తున్నాయి. వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు వస్తుండడం తో టికెట్స్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Read Also : AP Assembly: ఈ నెల 5నుంచి AP అసెంబ్లీ సమావేశాలు, జగన్ కీలక నిర్ణయాలు

  Last Updated: 01 Feb 2024, 03:58 PM IST