Nara Lokesh : మంగళగిరిలో లోకేష్‌ గెలుపు పక్కా.. ఈ వీడియోనే నిదర్శనం..!

ఏపీలో వేసవి వేడి కంటే.. ఎన్నికల వేడి మరింత హీటు పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు ప్రచారంపై నిమగ్నమయ్యాయి.

  • Written By:
  • Publish Date - April 1, 2024 / 06:25 PM IST

ఏపీలో వేసవి వేడి కంటే.. ఎన్నికల వేడి మరింత హీటు పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు ప్రచారంపై నిమగ్నమయ్యాయి. అయితే.. వైఎస్సార్‌సీపీ (YSRCP) పాలనతో దెబ్బతిన్న ప్రాంతాల్లో ఆ పార్టీ నేతల్లోనే అసమ్మతి నెలకొంది. క్షేత్రస్థాయిలో మీటింగ్‌లు పెట్టుకుంటే.. కింది స్థాయి నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చే ప్రశ్నలకు ఎమ్మెల్యే, మంత్రులు సమాధానం చెప్పలేక మాట దాటేస్తున్నారు. అలాంటిదే ఈ వీడియో.. 2019 ఎన్నికల తర్వాత నారా లోకేష్‌ (Nara Lokesh) మంగళగిరిలో మరోసారి పోటీలో ఉన్నారు. 2019లో తొలిసారిగా మంగళగిరి నుంచి లోకేష్‌ ఎన్నికలను ఎదుర్కొని పరాజయాన్ని చవిచూశారు. అయితే.. ఈ నేపథ్యంలో నారా లోకేష్‌ వేరే నియోజకవర్గానికి వెళతారని అందరూ ఊహించారు. కానీ.. అందుకు భిన్నంగా రాష్ట్రంలో టీడీపీ (TDP) గెలిచే స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నా.. టీడీపీ టఫ్‌గా ఉన్న మంగళగిరిలోనే గెలిచి తన సత్తా చాటుతా అంటూ.. ప్రజలతో మమేకమవుతున్నారు. అందుకోసం నియోజకవర్గంలోనే తిరుగుతూ.. అక్కడి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ప్రజలు మూడ్‌ కూడా నారా లోకేష్‌ వైపే ఉన్నట్లు కనిపిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

నారా లోకేష్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల (Kandru Kamala) కుమార్తె లావణ్య (Lavanya) పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (Alla Ramakrishna Reddy)తో కలిసి లావణ్య నియోజకవర్గంలోని గేటెడ్ కమ్యూనిటీలకు వెళ్లి ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. అయితే.. ఓ గేటెడ్ కమ్యూనిటీలలో వారికి చేదు అనుభవం ఎదురైంది. “ఇక్కడ నివాసితులు రెడ్డి, చౌదరి వర్గానికి చెందిన రైతులు. ముఖ్యంగా రెడ్డి కమ్యూనిటీ వారి పూజా గదులలో వైఎస్ఆర్ ఫోటోలు ఉంచుతారు. ఈ ప్రభుత్వానికి ముందు ఇక్కడ చదరపు అడుగు ధర 5500 రూపాయలు ఉంటే అది 3500 రూపాయలకు తగ్గింది. దయచేసి ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం తీసుకురండి, లేదంటే దాని ప్రభావం లావణ్య ఎదుర్కోవలసి ఉంటుంది, ”అని ఒక వ్యక్తి చెప్పాడు.

ప్రస్తుతం మంగళగిరిలో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పట్టేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన అడిగిన ప్రశ్నలకు అభ్యర్థి లావణ్యతో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇద్దరి వద్ద సమాధానాలు చెప్పలేక మిన్నకున్నారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని చంపినందుకు హార్డ్‌కోర్ జగన్‌ రెడ్డి ఓటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఇలాంటి దృశ్యాలే పునరావృతమవుతున్నాయి. అయితే.. ఇది చూసిన వారంతా.. మంగళగిరిలో ఈసారి నారా లోకేష్ గెలుపు తధ్యమని అంటున్నారు.
Read Also :AP Politics : వాలంటీర్లపై ఈసీ నిర్ణయం.. చంద్రబాబుపై విషప్రచారం..