Nara Lokesh: లోకేష్ మీటింగ్ కు కొడాలి, వ‌ల్ల‌భ‌నేని

ఏపీలోని ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాలు వివాద‌స్ప‌దం అయ్యాయి.

  • Written By:
  • Updated On - June 9, 2022 / 02:22 PM IST

ఏపీలోని ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాలు వివాద‌స్ప‌దం అయ్యాయి. ఇప్ప‌టికే కొంద‌రు విద్యార్థులు ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డారు. ఫ‌లితాల సీరియ‌స్ ను గమ‌నించి విద్యార్థుల‌తో జూమ్ మీటింగ్ పెట్టిన తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కు కొడాలి, వ‌ల్ల‌భ‌నేని జ‌ర్క్ ఇచ్చారు. హ‌ఠాత్తుగా జూమ్ మీటింగ్ లోకి జాయిన్ అయ్యారు. మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఎంట్రీ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. జూమ్ మీటింగ్ నడుస్తుండగానే వైసీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలు మధ్యలో ఎంటరయ్యారు. వంశీ ఆఫీసులోనే ఉండి ఓ విద్యార్థిని లాగిన్ అయింది. దీంతో ఆయన ఈజీగా మీటింగ్ లోకి ప్రవేశించారు. లోకేశ్ తో మాట్లాడే వంతు ఆ విద్యార్థినికి వచ్చిన సందర్భంలో వల్లభనేని వంశీ మాట్లాడే ప్రయత్నం చేయ‌డం క్ష‌ణాల్లో జ‌రిగింది. ఆ వెంటనే మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఆ జూమ్ మీటింగ్ లోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. వాళ్లిద్దరూ ఇలా సడన్ ఎంట్రీ ఇవ్వడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతర పెట్టారు.

కాన్ఫరెన్స్ లో వైసీపీ నేత‌లు కనిపించడంతో టీడీపీ నేతలు మండిపడ్డారు. కాగా, వంశీ జూమ్ మీటింగ్ లోకి ఎంటరవ్వంగానే నిర్వాహకులు ఆ లైన్ వీడియోను కట్ చేశారు. పదో తరగతి విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తే, కొడాలి నాని, వల్లభనేని వంశీ వెకిలినవ్వులతో శాడిజం చూపించార‌ని టీడీపీ మండిపడింది. నీచ రాజకీయానికి ఇలాంటి జూమ్ స‌మావేశాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డం పైశాచిక‌త్వం అంటూ ట్వట్ చేసింది.