YCP : ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందే – నారా లోకేష్

ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనంటూ సోషల్ మీడియాలో నారా లోకేష్ (Nara Lokesh) గీతాంజలి (Geethanjali) ఆత్మహత్య ను ఉద్దేశించి పోస్ట్ చేసారు. తెనాలికి చెందిన గీతాంజలి మరణం..ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ – ప్రతిపక్ష పార్టీ ల మధ్య చిచ్చు రేపుతోంది. వైసీపీ (YCP) సర్కార్ కు జై కొట్టిందని చెప్పి కొంతమంది ఈమెపై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ చేయడం తో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతికి కారణం టీడీపీ (TDP) , […]

Published By: HashtagU Telugu Desk
Lokesh Geethanjali

Lokesh Geethanjali

ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనంటూ సోషల్ మీడియాలో నారా లోకేష్ (Nara Lokesh) గీతాంజలి (Geethanjali) ఆత్మహత్య ను ఉద్దేశించి పోస్ట్ చేసారు. తెనాలికి చెందిన గీతాంజలి మరణం..ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ – ప్రతిపక్ష పార్టీ ల మధ్య చిచ్చు రేపుతోంది. వైసీపీ (YCP) సర్కార్ కు జై కొట్టిందని చెప్పి కొంతమంది ఈమెపై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ చేయడం తో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతికి కారణం టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలే అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే..తాజాగా టీడీపీ తన ట్విట్టర్ ఖాతాలో కీలక వీడియో ను షేర్ చేసింది.

‘గీతాంజలిని ఎవరు తోసేశారు? వైసీపీకి ఉన్న లింక్ బయటకు రావాలి’ అని ఆమె ఆత్మహత్యాయత్నం నాటి సమయంలో తీసిన వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో లో ‘ ఏంటి మాయ్యా అక్కడ ..? ఎవరు ఇద్దరు నెట్టేశారంట..ఆ అమ్మాయిని పట్టాల మీదకి అవునా..? ఎవరు నెట్టేశారంట మాయ్యా..? ఏమో మరి నెట్టేసి పారిపోయారంట..బ్రతికే ఉందా ఇంకా..ఆ ప్రాణం ఉంది..తీసుకెళ్లారా ఏంటి హాస్పటల్ కి ” అంటూ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునట్లు ఆ వీడియో లో ఉంది. ఈ వీడియో అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఈ తరుణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందే అంటూ వైసీపీ ని ఉద్దేశించి పోస్ట్ చేసిన ట్వీట్ మరింత దుమారం రేపుతోంది.

‘ సైకో జగన్ పార్టీ వైసీపీ పుట్టిందే తండ్రి శవం దగ్గర అంటూ లోకేశ్ విమర్శించారు. బాబాయ్ బలితో 2019లో ఓట్లు దండుకుంది అని, ఇప్పుడు ఎందుకోసం గీతాంజలిని బలి తీసుకుందో? అని సందేహం వెలిబుచ్చారు. ఇంకా ఈ బలి జాబితాలో ఎందరు ఉన్నారో? అని ఆందోళన వ్యక్తం చేశారు. YSR మరణంతో వైసీపీ పుట్టింది. గత ఎన్నికల వేళ బాబాయ్ శవంతో ఓట్లు పొందింది. వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమైన ప్రస్తుత దశలో ఓ మహిళ శవంతో వికృత రాజకీయాలు ఆరంభించింది. గీతాంజలి అనే ఆమెతో బలవంతంగా వీడియో రూపంలో అబద్ధాలు చెప్పించారు. ఆమె 7వ తేదీన ప్రమాదానికి గురైందో, ఆత్మహత్యాయత్నం చేసిందో తెలియదు కానీ… తీవ్రంగా గాయపడితే మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం కూడా చేయలేదు ఈ వైసీపీ సైకోలు.

We’re now on WhatsApp. Click to Join.

ఆమె నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడితే వైసీపీ సైకోలు అటువైపు కూడా చూడలేదు. చనిపోయిన తర్వాత మాత్రం మృతదేహంతో మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారు. గీతాంజలితో వైసీపీలోని పిల్ల సజ్జల గ్యాంగ్ చెప్పించిన అబద్ధాలను ఖండిస్తూ, టీడీపీ అభిమానులు ఆధారాలతో సహా 10వ తేదీన ప్రశ్నించారు.

ఇవన్నీ చూస్తుంటే… బాబాయ్ గొడ్డలిపోటును గుండెపోటుగా ప్రచారం చేసిన గ్యాంగ్… ఈ మరణాలన్నీ తమ వికృత రాజకీయాలకు వాడుకుంటున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది” అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read Also : CM Revanth Reddy : రేవంత్ మాట్లాడుతున్న తీరు ఫై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం

  Last Updated: 13 Mar 2024, 12:08 AM IST