సీఎం జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. “బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్. 42 వేల కోట్లు ప్రజాధనం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా పదేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాలరాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడు . జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బెయిలుపై ఉంటే, జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు సీబీఎన్ జైలులో ఉన్నారు “ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. సీబీఐ ఈడీ కేసుల్లో ఏ1 గా ఉన్న వ్యక్తి బయటతిరుగుతూ సీఎం అవ్వడం దౌర్భాగ్యమని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జగన్‌రెడ్డి శునకానందం పొందుతున్నారని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏ37గా ఉన్న చంద్రబాబుని అరెస్ట్ చేశారని.. సీబీఐ ఈడీ కేసుల్లో ఉన్న ఏ1 మాత్రం బెయిల్ పై బయట తిరుగుతున్నారన్నారు.
Nara Lokesh : జగన్‌కు బెయిల్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన లోకేష్

Nara Lokesh