Viral : పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న నారా లోకేష్

సోదరసమానులైన వ్యక్తి ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పులేదంటూ ఆయన పాదాలను తాకారు

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh Took Pawan Kaly

Nara Lokesh Took Pawan Kaly

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ (Nara Lokesh)…జనసేన ధినేత పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న వీడియో కాస్త ఆలస్యంగా బయటకు వచ్చి వైరల్ గా మారింది. బుధువారం గన్నవరంలో కేసరపల్లి లో చంద్రబాబు తో పాటు 24 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ వేడుకకు ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులు నడ్డా, అమిత్ షా తదితర రాజకీయ నేతలు , చిరంజీవి , రజనీకాంత్ వంటి అగ్ర సినీ తారలతో పాటు మెగా , నందమూరి , నారా వారి ఫ్యామిలీ ఇలా ఎంతో మంది హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కు సంబదించిన వీడియోస్ నిన్నటి నుండి వైరల్ కాగా..ఇక ఇప్పుడు నారా లోకేష్ కు సంబదించిన వీడియో వైరల్ గా మారింది.

నారా లోకేష్‌తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవలేరంటూ వైసీపీ చేసిన ప్రచారానికి లోకేష్ ఘాటైన విజయం తో వారి నోరు మూయించారు. ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రి లోకేష్ ..జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకున్న వీడియో తాజాగా బయటకొచ్చింది. పవన్ వద్దంటున్నప్పటికీ సోదరసమానులైన వ్యక్తి ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పులేదంటూ ఆయన పాదాలను తాకారు. దీనికి సంబంధించిన వీడియోను జనసైనికులు, టీడీపీ ఫాలోవర్లు షేర్ చేస్తున్నారు. ఇది చూశాక లోకేశ్ ఫై మరింత అభిమానం పెరిగిందని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన స్పెషాలిటీ అని కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Garlic Benefits: వెల్లుల్లి తింటే ఈ సమస్యలన్నీ దూరం..!

  Last Updated: 13 Jun 2024, 01:15 PM IST