Nara Lokesh Nomination : ఈసారి లోకేష్ గెలుపును ఎవ్వరు ఆపలేరు..

పాతమంగళగిరి సీతారామ కోవెల నుంచి వేలాదిమందితో ర్యాలీగా బ‌య‌లుదేరిన లోకేష్ కు దారి పొడవుతూ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నారా లోకేష్‌కు మద్ద‌తు తెలిపారు

Published By: HashtagU Telugu Desk
Lokesh Nomition

Lokesh Nomition

టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి..మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ (Nara Lokesh ) గెలుపు ఖాయం అని అంత ఫిక్స్ అవుతున్నారు. దీనికి ఉదాహరణే ఈరోజు లోకేష్ నామినేషన్ (Nara Lokesh Nomination) పర్వం. గత ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుండి చేసి ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఏమాత్రం నిరాశ పడకుండా..ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనే సామెత మాదిరి ఎక్కడైతే ఓటమి చెందమో ..అక్కడే భారీ విజయం సాధించి సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు. మరోసారి మంగళగిరి బరిలో నిల్చున్నాడు. గత కొద్దీ నెలలుగా నియోజకవర్గంలోనే పర్యటిస్తూ ప్రజలకు దగ్గర అవుతూ..వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం..ఆ సమస్యలను తీర్చడం వంటి చేస్తూ వస్తున్నారు. ఇక ఈరోజు నామినేషన్ల పర్వం మొదలు కావడం తో భారీ ర్యాలీ తో ఈరోజు నామినేషన్ దాఖలు చేసారు.

పాతమంగళగిరి సీతారామ కోవెల నుంచి వేలాదిమందితో ర్యాలీగా బ‌య‌లుదేరిన లోకేష్ కు దారి పొడవుతూ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నారా లోకేష్‌కు మద్ద‌తు తెలిపారు. ఇక ప్రధాన రహదారులు ప‌సుపు జెండాలో మూసుకు పోయాయి. కూటమి పార్టీలైన బీజేపీ, జ‌న‌సేనల నుంచి కూడా కీల‌క నేతలు , కార్యకర్తలు హాజ‌ర‌య్య‌రు. సీతారామస్వామి కోవెల, మిద్దె సెంటర్ నడుమ భారీగా జనసందోహం హాజ‌రై.. నారా లోకేష్‌కు ముంద‌స్తు అభినంద‌న‌లు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

మంగళగిరిలోని కార్పొరేషన్ కార్యాలయంలో లోకేష్ తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి రాజకుమారి గనియాకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను నేతలు అందజేశారు. టీడీపీ సమన్వయ కర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయ కర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ నేతృత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి పోతినేని శ్రీనివాసరావు, దామర్ల రాజు, తోట పార్థసారధి, ఆరుద్ర భూలక్ష్మీ, ఆకుల జయసత్య, బొంతు సాంబిరెడ్డి, ఇబ్రహీం, విజయ్ కుమార్, చాగంటి పూర్ణ, జ్యోతిబసు, సంకా బాలాజీ గుప్తా, మైనర్ బాబు, రేఖా సుధాకర్ గౌడ్, ఇట్టా పెంచలయ్య హాజరయ్యారు.

లోకేష్ కు మద్దతు తెలిపేందుకు వచ్చిన ప్రజలను , కార్యకర్తలను చూసి అంత లోకేష్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి లోకేష్ భారీ మెజార్టీ తో గెలవబోతున్నాడని..మీరు రాసి పెట్టుకోండి అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Gali Bhanuprakash Nomination : గాలి భాను నామినేషన్ కు వచ్చిన జనాలని చూస్తే ..రోజాకు డిపాజిట్ కష్టమేనా..?

  Last Updated: 18 Apr 2024, 05:34 PM IST