Nara Lokesh : ఢిల్లీకి నారా లోకేష్ ..పూర్తి షెడ్యూల్ ఇదే

Nara Lokesh : ప్రధానంగా కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి అవసరమైన విషయాలను చర్చించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు సాధించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.

Published By: HashtagU Telugu Desk
Lokesh Delhi

Lokesh Delhi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో ఆయన బుధ, గురువారాలు రెండు రోజులు బిజీ షెడ్యూల్‌లో ఉండనున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీ (Delhi)కి బయలుదేరి వెళ్లనున్న లోకేష్, ప్రధానంగా కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి అవసరమైన విషయాలను చర్చించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు సాధించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.

Air India Planes: RAT అంటే ఏమిటి? ఇది ఎయిర్ ఇండియా విమానాలను ఎలా తనిఖీ చేస్తుంది?

18వ తేదీ బుధవారం ఉదయం 10.30 గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను కలుసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో, 4.30 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో, 5.30 గంటలకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో లోకేష్ సమావేశం కానున్నారు. ఈ భేటీల్లో రాష్ట్ర విద్య, పరిశ్రమలు, న్యాయసౌకర్యాలపై చర్చించే అవకాశం ఉంది.

19వ తేదీ గురువారం నారా లోకేష్ కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియాతో సమావేశమవుతారు. అనంతరం యునైటెడ్ కింగ్‌డమ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో భేటీ జరుగుతుంది. ఈ సమావేశం రాష్ట్రానికి అంతర్జాతీయ సహకారాన్ని ఆకర్షించడంలో కీలకమవుతుందని అంచనా. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర స్థాయిలో సహకారం కోసం చేస్తున్న ఈ పర్యటనలో లోకేష్ దిశగా స్పష్టమైన దౌత్యం కొనసాగించనున్నారు.

  Last Updated: 17 Jun 2025, 09:45 PM IST