Site icon HashtagU Telugu

Nara Lokesh : అసెంబ్లీ లో లోకేష్ ప్రమాణం పై వైసీపీ సెటైర్లు

Nara Lokesh Pramanam

Nara Lokesh Pramanam

ఏపీ సమావేశాలు (AP Assembly 2024) శుక్రవారం ప్రారంభం అయ్యాయి. మొదటిరోజు 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ముందుగా సీఎం చంద్రబాబు..తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ప్రమాణ స్వీకారం చేయగా..ఆ తరువాత వరుసపెట్టి నేతలంతా ప్రమాణ స్వీకారం చేసారు. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు వేర్వేరు కారణాల వల్ల ఈరోజు అసెంబ్లీకి రాలేకపోయారు. రేపు ఉదయం 10.30గంటలకు సభ పున:ప్రారంభం కాగానే మిగిలిన ముగ్గురు సభ్యులు రేపు ప్రమాణం చేసే వీలుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె అసెంబ్లీ లో మొదటిసారి నారా లోకేష్ (Nara Lokesh) ఎమ్మెల్యే హోదాలో ప్రమాణ స్వీకారం చేసారు. ప్రమాణం చేసే సమయంలో నారా లోకేశ్ తడబడటంపై వైసీపీ శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నాయి. ‘శ్రద్ధాసక్తులు’ అనే పదాన్ని పలకడంలో ఆయన ఇబ్బందిపడ్డారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. దీనికి టీడీపీ శ్రేణులు స్పందిస్తూ.. ‘కూటమి దెబ్బకు మీ నాయకుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ కూడా తన పూర్తి పేరును మరిచిపోయారు’ అని కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం మీద అసెంబ్లీ స్టార్ట్ అయ్యిందో లేదో వైసీపీ – టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది.

Read Also : Paper Leaks: ప్రశ్నపత్రాల లీకేజిపై యోగి సర్కార్ సంచలన నిర్ణయం