Site icon HashtagU Telugu

Yuvagalam : కొడాలి నాని ని కట్ డ్రాయర్ తో ఊరేగిస్తా అంటూ లోకేష్ సవాల్

Nara Lokesh Warning to Kodali Nani

Nara Lokesh Warning to Kodali Nani

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సక్సెస్ ఫుల్ గా 191 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. ఈ తరుణంలో మంగళవారం గన్నవరం (Gannavaram) కు చేరుకుంది. ఈ సందర్బంగా టీడీపీ నేతలు గన్నవరం లో భారీ సభ (Yuvagalam Gannavaram Public Meeting) ఏర్పాటు చేసి లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. ఈ సభలో టీడీపీ నేతలంతా పాల్గొన్నారు. సభ వేదికగా నేతలంతా సీఎం జగన్ తో పాటు వైసీపీ మంత్రుల ఫై విరుచుకపడ్డారు. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు తన స్పీచ్ తో టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు.

ఇక లోకేష్ సైతం పదునైన డైలాగ్స్ తో వైసీపీ నేతలకు (YCP Leaders) చెమటలు పట్టించారు. గన్నవరం వేదికగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (YCP MLA Kodali Nani ) , అలాగే వంశీ (Vallabhaneni Vamsi)ఫై అగ్రం వ్యక్తం చేసారు. ఈ ఇద్దర్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. పేకాట క్లబ్బులు, గుట్కా తప్ప మరే విషయం మీదా కొడాలి నానికి అవగాహన లేదని నారా లోకేష్ విమర్శించారు. కొడాలిని సన్నబియ్యం సన్నాసిగా అభివర్ణించారు. నిండు శాసన సభలో తన తల్లిని అవమానించి.. చాలా పెద్ద తప్పు చేశాడని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఇంకో తొమ్మిది నెలల్లో వచ్చేది తమ ప్రభుత్వమేనని, గుడివాడలో కొడాలి నానిని కట్ డ్రాయర్ తో ఊరేగించే బాధ్యత తాను తీసుకుంటానని శపథం చేశారు. వైసీపీ నాయకులు చేసిన తప్పులన్నింటినీ ఎర్రబుక్‌లో రాసుకుంటోన్నానని, వాటన్నింటినీ తిరిగి ఇస్తామని, రాష్ట్రం వదిలి వెళ్లినా వెంటబడతామని అన్నారు.

అలాగే గన్నవరంలో ఓ పిల్ల సైకో ఉన్నాడు అంటూ వంశీ ఫై మండిపడ్డారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు సార్ సార్ అంటుండేవాడు. కూర్చొవయ్యా అంటే.. వద్దు సార్ అనేవాడు. పిల్ల సైకో చాలా పెద్ద నటుడు. పిల్ల సైకోకు భయం పరిచయం చేస్తా అని గన్నవరం టీడీపీ శ్రేణులకు హామీ ఇచ్చాడు. అలాగే సీఎం జగన్ ఫై కూడా లోకేష్ ఘాటు విమర్శలే చేసాడు.

జగన్ పాదయాత్రకు టీడీపీ ప్రభుత్వం అవసరానికి మించి సెక్యూరిటీ కల్పించాం. పాదయాత్ర చేసుకో బిడ్డా అంటూ పంపాం. నేను పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి అడుగుడగునా అడ్డుకున్నారు. ఆనాడే చెప్పాను. సాగనిస్తే పాదయాత్ర లేకుంటే దండయాత్ర అని. లోకేశ్ పాదయాత్ర చేస్తుంటే జగన్ కు కాలినొప్పి వచ్చింది. ఇచ్చిన హామీల విషయంలో పదే పదే మడమ తిప్పారు. అందుకే మడమ నొప్పి వచ్చిందంటూ సెటైర్లు వేశారు.

Read Also : Ayyanna Patrudu : యువగళం సభలో సీఎం జగన్ ఫై రెచ్చిపోయిన అయ్యన్నపాత్రుడు