Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో సీఐడీ నోటీసులకు భయపడేది లేదని టీడీపీ అగ్రనేత నారా లోకేష్ తేల్చి చెప్పారు. తాను ఢిల్లీలోనే ఉన్నానని.. సీఐడీ వాళ్ళు వచ్చి నోటీసులు ఇస్తే తప్పకుండా తీసుకుంటానని వెల్లడించారు. భయపడి దాక్కునే అలవాటు తనకు లేదన్నారు. ‘‘నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. ఢిల్లీలోనే ఉన్నాను. ఇప్పుడు హోటల్ మౌర్యలో ఉన్నాను. ప్రతి రోజూ వర్చువల్ గా పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నాను. 50 అశోక రోడ్‌లో ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో కూడా ఉంటున్నా. అప్పుడప్పుడు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కార్యాలయానికి వెళ్తున్నా’’ అని ఢిల్లీలో తాను ఉంటున్న ప్రదేశాల వివరాలను లోకేశ్ వెల్లడించారు.
Also read : Toyota Land Cruiser Mini : టయోటా నుంచి సరికొత్త ల్యాండ్ క్రూయిజర్ మినీ రాబోతుంది…
‘‘సీఐడీ వాళ్ళు ఇంకా నా దగ్గరకు రాలేదు. వాళ్ళు వస్తే నోటీసులు తీసుకుంటా. దాక్కునే అలవాటు నాకు లేదు. ఎవరో ఏదో ప్రచారం చేస్తే నాకేంటి సంబంధం? నేను ఢిల్లీ వచ్చిన నాటి నుంచి ఎక్కడ ఉంటున్నా అనేది అందరికీ తెలుసు. కావాలని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని టీడీపీ క్యాడర్ కు ఆయన సూచించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఈవిధంగా తాను ఉంటున్న అడ్రస్‌ల వివరాలతో సహా చెప్పి లోకేశ్ (Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు.
