Nara Lokesh : మంగళగిరి ఫై నారా లోకేష్ వరాల జల్లు..

మంగళగిరి ఫై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) వరాల జల్లు కురిపించారు. అతి త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు వరాల జల్లు కురిపిస్తూ ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో నేడు మంగళగిరి లో టీడీపీ – జనసేన కూటమి జయహో బీసీ సభ (BC Sabha) ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ..మంగళగిరి […]

Published By: HashtagU Telugu Desk
Lokesh Bc Meeting

Lokesh Bc Meeting

మంగళగిరి ఫై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) వరాల జల్లు కురిపించారు. అతి త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు వరాల జల్లు కురిపిస్తూ ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో నేడు మంగళగిరి లో టీడీపీ – జనసేన కూటమి జయహో బీసీ సభ (BC Sabha) ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ..మంగళగిరి (Mangalagiri) ప్రజలకు వరాల జల్లు కురిపించారు.

గత ఎన్నికల్లో మంగళగిరి లో స్వల్ప తేడాతో ఓటమి చెందా.. కేవలం 21 రోజుల ముందే నియోజకవర్గానికి వచ్చాను. కానీ, గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మంగళగిరి ప్రజల కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా 29 సంక్షేమ పథకాలు మంగళగిరిలో చేశాం. మీరు ముందుకు నడవండి మీకు అండగా మేముంటాం అని నియోజకవర్గ ప్రజలు కొండంత భరోసా ఇచ్చారు. వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు గారికి మంగళగిరి ప్రజల తరఫున కొన్ని విజ్ఞప్తులు చేస్తున్నా. మొదటిది… కొండ పోరంబోకు, ఫారెస్ట్, ఇరిగేషన్, దేవాదాయ, రైల్వే భూముల్లో మంగళగిరి ప్రజలు దశాబ్దాలుగా ఉంటున్నారు. ఇళ్లు కూడా కట్టుకున్నారు.

ఒక తరం కాదు, రెండు తరాలుగా కాదు… మూడు తరాలుగా అక్కడుంటున్నారు. ఆ భూములను క్రమబద్ధీకరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాల కోసం 20 వేల ఇళ్లు కూడా కట్టించాల్సి ఉందని.. పద్మశాలీలు చాలా చోట్ల చేనేతలుగా ఉంటారు… మంగళగిరి నియోజకవర్గంలో వారు స్వర్ణకారులుగా ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పద్మశాలీ సోదరులను ఆదుకునేందుకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. మంగళగిరిలో చేనేత కార్మికుల కోసం తీసుకువచ్చిన పైలెట్ ప్రాజెక్టును రాష్ట్రస్థాయికి తీసుకెళ్లాలని కూడా పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ సందర్భంగా కొందరు రైతుల భూములను యూ1 జోన్ లో పెట్టడం జరిగింది. అందువల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది కూడా రద్దు చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నమన్నారు.

అలాగే జగన్ ఫై లోకేష్ నిప్పులు చెరిగారు. బీసీల కోసం ఏకంగా మంత్రిత్వ శాఖ ఉండాలని కూడా టీడీపీ తీర్మానం చేసింది. కానీ ఈ జగన్ సీఎం అయ్యాక బీసీ సోదరులకు వెన్నుపోటు పొడిచాడు. ఆనాడు బీసీలే వెన్నెముక అన్న వ్యక్తి ఈరోజు బీసీ సోదరుల వెన్నెముక విరగ్గొట్టాడు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. బీసీ అంటే భవిష్యత్తు, బీసీ అంటే భరోసా… బీసీ అంటే బలహీనవర్గం కాదు… బలమైన వర్గం అని చెప్పుకొచ్చారు.

రూ.3 వేల కోట్ల నిధులతో 4.20 లక్షల మంది బీసీలను పేదరికం నుంచి బయటికి తీసుకువచ్చిన పార్టీ టిడిపి అని , ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు కేటాయించి, పనిముట్లు కూడా అందించిన పార్టీ టీడీపీ అని వివరించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కిల్ డెవలప్ మెంట్, స్టడీ సర్కిళ్లు, విదేశీ విద్య వంటి పథకాలు తీసుకువచ్చిన జెండా మన పసుపు జెండా అని వెల్లడించారు.

Read Also : Gummanur Jayaram : మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరామ్ బర్తరఫ్

  Last Updated: 05 Mar 2024, 09:48 PM IST