Nara Lokesh : పదేళ్ల తరువాత మోడీతో నారాలోకేష్ కొడుకు.. వైరల్ అవుతున్న ఓల్డ్ పిక్..

పదేళ్ల తరువాత మోడీతో నారాలోకేష్ కొడుకు దేవాన్ష్. గతంలో మోడీతో దేవాన్ష్ ఉన్న పిక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.

  • Written By:
  • Updated On - June 15, 2024 / 03:56 PM IST

Nara Lokesh : ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికలు దేశంలోనే ఇంటరెస్టింగ్ టాపిక్ గా మారింది. వైసీపీని గద్దె దించేందుకు ఒకటైన టీడీపీ, జనసేన, బీజేపీ.. యువతని ఆకర్షించి అత్యధిక ఓటింగ్ జరిగేలా చేసి, భారీ మెజారిటీతో గెలుపొందింది. ఇక ఈ ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే.. నారా లోకేష్, పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు గత ఎన్నికల్లో ఓడిపోయి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపుని సొంతం చేసుకున్నారు.

ముఖ్యంగా నారా లోకేష్ గెలుపు అందర్నీ అభినందించేలా చేసింది. ఎందుకంటే, నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరి దశాబ్దాల కాలం అవుతుంది. అలాంటి నియోజకవర్గంలో.. రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజారిటీతో లోకేష్ గెలుపొంది సత్తా చాటారు. ఇక ఈ గెలుపుతో నారా వారి కుటుంబం సంబరాలు జరుపుకుంది. ఇక ఇటీవల జరిగిన ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి మోడీ వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రమాణ స్వీకారం తరువాత మోడీ నారా వారి కుటుంబాన్ని పలకరించి వారితో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇక ఈ ఫోటోలను నారా బ్రాహ్మణి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు. వీటిలో ఓ పిక్ అందర్నీ ఆకట్టుకుంది. నారా వారి వారసుడు లోకేష్ కుమారుడు ‘దేవాన్ష్’ భుజాలు పై మోడీ చెయ్యి వేసి ఫోటో దిగిన పిక్ వైరల్ గా మారింది. ఈ పిక్ వైరల్ గా మారడానికి కారణం.. గతంలోని ఓ ఫోటో. 2014లో కూడా టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో నారా కుటుంబాన్ని కలుసుకున్న మోడీ.. సంవత్సరం వయసులో ఉన్న దేవాన్ష్ ని ముద్దాడారు. అందుకు సంబంధించిన ఫోటో అప్పటిలో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు పదేళ్ల తరువాత మళ్ళీ మోడీతో దేవాన్ష్ కనిపించడంతో.. టీడీపీ అభిమానులు ఈ కొత్త ఫోటోని పాత ఫోటోతో జత చేస్తూ వైరల్ చేస్తున్నారు.