Site icon HashtagU Telugu

Nara Lokesh : బీసీల ద్రోహి సీఎం జ‌గ‌న్‌.. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ ప‌నులు త‌ప్ప‌కుండా చేస్తాం

Nara Lokesh

Nara Lokesh

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర  (yuva galam padayatra) నెల్లూరు జిల్లా (Nellore District) లో కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు దోచుకోవడం తప్ప ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలపై శ్రద్ధ లేదని విమ‌ర్శించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగాఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, కాంట్రాక్టర్లకు లక్ష కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో టెండర్లు పిలిచినా వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని అన్నారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత గుండ్లపాడు – కృష్ణపట్నం ఓడరేవు రోడ్డును నాలుగు లైన్లుగా మార్చుతామ‌ని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక కులానికొక కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం తప్ప బీసీలకు ఒరిగిందేమీ లేదని లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

బీసీల‌కు చెందాల్సిన రూ.75,760 కోట్లు దారి మళ్లించిన‌ బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని లోకేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే గూండాలు, రౌడీలతో మా గొంతునొక్కుతున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకివస్తే ప్రతియేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేస్తామ‌ని అన్నారు. పెద్దఎత్తున పరిశ్రమలు రప్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని అన్నారు. ఉద్యోగం వచ్చేవరకు యువగళం నిధికింద యువతకు రూ.3వేల రూపాయల పెన్షన్ ఇస్తామ‌ని, రాష్ట్రవ్యాప్తంగా పాడైపోయిన రహదార్లను యుద్ధప్రాతిపదికన పునర్నిర్మిస్తామ‌ని అన్నారు.

అందరికీ విద్య అనేది ప్రాథమిక హక్కు.. స్కూళ్ల విలీనంతో జగన్ పేదలకు విద్యను దూరం చేస్తున్నారు. సంస్కరణల పేరుతో విద్యను నిర్వీర్యం చేస్తున్నారు. నాడు-నేడు పేరుతో వేలకోట్లు దోచుకోవడం తప్ప విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదని లోకేష్ అన్నారు.

Minister Rajini : చంద్ర‌బాబు, లోకేష్‌కు స‌వాల్ విసిరిన మంత్రి విడుద‌ల ర‌జ‌ని.. బ‌హిరంగ చ‌ర్చ‌కు రెడీ అట‌