ఇటీవల తిరుమల(Tirumala) నడక దారిలో చిరుత(Leopard)లు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. చిరుతలు నడక మార్గంలో సంచరిస్తున్నాయని తెలియడంతో, దాడి చేసిందని తెలియడంతో భక్తులు భయపడుతున్నారు. భక్తుల రక్షణకు చర్యలు తీసుకోవాలంటూ భక్తులు, ప్రతి పక్షాలు కోరారు.
అయితే ఈ విషయంలో టీటీడీ(TTD) నడక మార్గంలో వెళ్లే వారికి చేతి కర్రలు ఇస్తామని ప్రకటించడంతో ఈ విషయంలో టీటీడీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కర్రని చూపిస్తే చిరుతలు పారిపోతాయా అని తీవ్రమైన ట్రోలింగ్ చేస్తున్నారు ప్రజలు, నెటిజన్లు. దీనిపై ప్రతిపక్షాలు, పలువురు ప్రముఖులు కూడా విమర్శించారు.
తాజాగా నేడు టీటీడీ బోర్డు సమావేశం ఉండగా నారా లోకేష్ దీనిపై స్పందించారు. ఈ విషయంపై నారా లోకేష్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. నారా లోకేష్(Nara Lokesh) తన ట్వీట్ లో.. తిరుమల కొండను బోడి గుండుతో పోల్చిన భూమన కరుణా ‘ కర్ర ‘ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు టీటీడీ బోర్డు సమావేశం జరుగుతుంది. నడకమార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులకి కర్రలు ఇవ్వడం, అడ్డమైన నిబంధనలు పెట్టడం లాంటి నిర్ణయాలు కాకుండా నిర్మాణాత్మక ఆలోచన చెయ్యాలని కోరుతున్నాను. పులుల నుండి భక్తుల రక్షణ కోసం నడకమార్గంలో పటిష్ట ఫెన్సింగ్ ఏర్పాటు చెయ్యడమే శాశ్వత పరిష్కారం. టీటీడీ ఈ నిర్ణయం తీసుకోకపోతే టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భక్తులకు రక్షణ కల్పిస్తాం అని అన్నారు. మరి దీనిపై టీటీడీ ఏ నిర్ణయాలు తీసుకుందో ఇంకా వెల్లడించలేదు.
Also Read : CBN No Arrest : ఆగడు..ఆపలేరు.! ఐటీతో అరెస్ట్ తూచ్.!