Nara Lokesh: జ‌నం చెవుల్లో.. జ‌గ‌న్ పూలు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్నిముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌ర్ రెడ్డి ఫూల్ చేశార‌ని తెలుగుదేశంపార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఎన్నికల నేప‌ధ్యంలో ఇచ్చిన‌ హామీల అమలు విషయంలో, రాష్ట్ర‌ ప్రజలను జగన్ ఏప్రిల్ ఫూల్స్ చేశారంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ క్ర‌మంలో జనం చెవిలో జగన్ పూలు పెట్టారని, విద్యుత్ చార్జీలు తగ్గింపు, మధ్య నిషేధం హామీ, ప్రత్యేక హోదా సాధన, సన్న బియ్యం పంపిణీ హామీలన్నీ అమలు చేయకుండా ప్రజలను ఏప్రిల్ […]

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh Ys Jagan

Nara Lokesh Ys Jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్నిముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌ర్ రెడ్డి ఫూల్ చేశార‌ని తెలుగుదేశంపార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఎన్నికల నేప‌ధ్యంలో ఇచ్చిన‌ హామీల అమలు విషయంలో, రాష్ట్ర‌ ప్రజలను జగన్ ఏప్రిల్ ఫూల్స్ చేశారంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ క్ర‌మంలో జనం చెవిలో జగన్ పూలు పెట్టారని, విద్యుత్ చార్జీలు తగ్గింపు, మధ్య నిషేధం హామీ, ప్రత్యేక హోదా సాధన, సన్న బియ్యం పంపిణీ హామీలన్నీ అమలు చేయకుండా ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేశారని లోకేష్ సెటైర్స్ వేశారు.

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వైకాపా ప్రభుత్వం భారీగా విద్యుత్ చార్జీలను పెంచింది. గతంలో విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని రంకెలు వేస్తూ ప్రకటనలు చేసిన జగన్.. ఇపుడు మమడ తిప్పి విద్యుత్ చార్జీల బాదుడుకు తెరలేపారని ఆయన ఆరోపించారు. ఈ క్ర‌మంలో వైకాపా ప్రొడక్షన్స్ సమర్పించు ఓ అత్యద్భుతమైన సినిమా ఏప్రిల్‌ 1 విడుదల’ అంటూ.. ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. రాజధాని అమరావతి, వారం రోజుల్లో సీపీఎస్ రద్దు హామీలు విస్మరించిన తీరును ఎండగడుతూ.. నాలుగున్నర నిమిషాల వీడియోను తన ట్విటర్ ఖాతాకు జత చేశారు. మ‌రి లోకేష్ వ్యాఖ్య‌ల పై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.

  Last Updated: 01 Apr 2022, 04:19 PM IST