Nara Lokesh : బాలకృష్ణ, పవన్‌ కంటే కరకట్ట కమల్ హాసన్ మంచి నటుడు

ఏపీలో రోజు రోజుకు రాజకీయ వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ (TDP) కూటమి ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అధికార వైఎస్సార్‌సీపీ (YSRCP) వ్యూహాలు రచిస్తోంది.

  • Written By:
  • Publish Date - March 20, 2024 / 06:13 PM IST

ఏపీలో రోజు రోజుకు రాజకీయ వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ (TDP) కూటమి ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అధికార వైఎస్సార్‌సీపీ (YSRCP) వ్యూహాలు రచిస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే కీలక అభ్యర్థులను నియోజకవర్గాల వారీగా ట్రాన్స్‌ఫర్‌ చేశారు వైసీపీ చీఫ్‌ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy). అయితే.. మేము కూడా తగ్గేదెలే అన్నట్లు టీడీపీ నేతలు ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కంటే కరకట్ట కమల్ హాసన్ మంచి నటుడు అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara lokesh) అన్నారు. కరకట్ట కమల్‌హాసన్‌ ఎవరని ఆరా తీస్తే.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (Alla Ramakrishna Reddy)ని ఉద్దేశించి లోకేష్ వ్యాఖ్యానించారు.

We’re now on WhatsApp. Click to Join.

మంగళగిరిలో జరిగిన రచ్చబండలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పేర్కొంటూ కొన్ని నెలల క్రితం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి వైదొలిగిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని అద్భుతమైన నటుడిగా అభివర్ణించారు. ఆ తర్వాత వైఎస్ షర్మిల (YS Sharmila) నేతృత్వంలో కాంగ్రెస్‌లో చేరారు. అనతికాలంలోనే ఆయన మనసు మార్చుకుని కారణం లేకుండా వైసీపీలోకి వచ్చారు. మంగళగిరిలో ఎన్నికల ప్రచారంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి మళ్లీ వచ్చి తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తారని లోకేష్ అన్నారు.

ఆయన పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో తాను ఓడిపోయానని, ప్రజల సమస్యలను అర్థం చేసుకోలేక, వాళ్లు తనను అర్థం చేసుకోలేక పోయానని లోకేష్ అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా లోకేష్ మాత్రం మంగళగిరిని వీడలేదు. ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేశారు. గత ఐదేళ్లలో ప్రతిపక్షనేతగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు తాను చేసిన కృషిని లోకేష్ గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత కష్టపడి పనిచేస్తానన్నారు.
Read Also : KCR National Politics: కేసీఆర్ జాతీయ స్థాయి ముచ్చట మర్చిపోవాల్సిందేనా?