Nara Lokesh Red Book: నారా లోకేష్ రెడ్ బుక్ రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజకీయాలు ఊపందుకున్నాయి. పవన్ కళ్యాణ్ చేత ఇదే రెడ్ బుక్ కనిపించింది. ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వకముందు ఇదే రెడ్ బుక్ లో కొందరి పేర్లను ఉంచానని చెప్పారు. ఇంతకీ ఈ రెడ్ బుక్ కథేంటి?

Nara Lokesh Red Book: ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజకీయాలు ఊపందుకున్నాయి. పవన్ కళ్యాణ్ చేత ఇదే రెడ్ బుక్ కనిపించింది. ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వకముందు ఇదే రెడ్ బుక్ లో కొందరి పేర్లను ఉంచానని చెప్పారు. ఇంతకీ ఈ రెడ్ బుక్ కథేంటి? ఆ బుక్ ద్వారా రాజకీయాలు ప్రధానంగా వేడెక్కుతున్నాయి.ఇచ్చాపురంలో మొదలైన ఈ రెడ్ బుక్ ప్రస్తావన ఏపీ రాజకీయాలను ఏం చేస్తుందో తెలియదు గాని.. ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారింది.కేసులను రెడ్ బుక్ లో నమోదు చేస్తారు. ప్రస్తుతం నారా లోకేష్ కూడా ఆ పుస్తకాన్నే ప్రజల ముందుకు తెచ్చాడు. నారా లోకేష్ శంఖారావం పేరుతో మలిదశ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీని ఇబ్బంది పెట్టిన పోలీసులు, వైసీపీ నాయకుల పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేశామని నారా లోకేష్ ప్రకటించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. మా అధినేత చంద్రబాబు నాయుడును జగన్ ప్రభుత్వం 53 రోజుల పాటు అక్రమంగా జైలులో పెట్టిందని అన్నారు. గత 4 ఏళ్ల 10 నెలల్లో టీడీపీ కార్యకర్తలపై అనేక కేసులు పెట్టారు. టీడీపీ నేతలను ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బందులకు గురిచేసిన అధికారులు, వైఎస్సార్సీపీ నేతల పేర్లను రెడ్ బుక్‌లో రాసుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్ హెచ్చరించారు. లోకేష్ ఇంకా మాట్లాడుతూ… గత ఏడాది మేలో విడుదల చేసిన బాబు హామీ – భవిష్యతుకు హామీలోని సూపర్ సిక్స్ వాగ్దానాల అమలుకు కూడా ఆయన హామీ ఇచ్చారు. అందులో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పాఠశాలకు వెళ్లే ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15,000, 20 లక్షల ఉద్యోగ అవకాశాలు లేదా నిరుద్యోగ భృతి నెలకు 3,000, 19 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు నెలకు 1,500. మరియు ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 ఆర్థిక సహాయం.ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ఆధారంగానే గత ఏడాది కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

లోకేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని గంజాయి దందాకు కేంద్రంగా మార్చారని ఆరోపించారు.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఆంధ్రప్రదేశ్ యువతను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో దళిత, వెనుకబడిన వర్గాలు అఘాయిత్యాలకు గురవుతున్నాయని ఆరోపించారు. అమర్‌నాథ్‌ తరహాలో మరికొంత మంది బీసీ పిల్లలను చంపేందుకు జగన్ సిద్ధమా?’ అని లోకేష్ ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్‌ని చంపినట్లే మరి దళితులను చంపేందుకు సిద్ధమవుతున్నారా? మిస్బా అనే అమ్మాయిని చంపినట్లుగా మరికొంతమంది మైనారిటీలను చంపాలనే తపన జగన్ లో కనిపిస్తుందని ధ్వజమెత్తారు.

గతేడాది జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో అమర్‌నాథ్ అనే 15 ఏళ్ల బాలుడిని ఐదుగురు వ్యక్తులు హత్య చేశారు. డాక్టర్ సుధాకర్ 2021లో గుండెపోటుతో మరణించాడు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీనిని రాజకీయ హత్యగా అప్పట్లో పేర్కొన్నారు. సంవత్సరం క్రితం కోవిడ్ -19 రోగులకు చికిత్స చేస్తున్న వైద్య నిపుణులను వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం తగిన విధంగా సన్నద్ధం చేయలేదని డాక్టర్ సుధాకర్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేశాడు.

Also Read: Lok Sabha Elections : టైమ్స్ నౌ సర్వే.. కాంగ్రెస్‌కు 9 ఎంపీ స్థానాలు.. బీఆర్ఎస్, బీజేపీకి ఎన్నో తెలుసా ?