Site icon HashtagU Telugu

Jagan Bandage : జగన్ గాయం..మటుమాయం అంటూ లోకేష్ సెటైర్లు

Lokesh Jagan Sti

Lokesh Jagan Sti

జగన్ గాయం ఏమైంది..నిన్నటి వరకు బ్యాండెయిడ్‌(స్టిక్క‌ర్‌) లతో కనిపించిన జగన్..ఈరోజు బ్యాండెయిడ్‌ లేకుండా కనిపించేసరికి అంత ఆశ్చర్యపోతూ..ఏ జగన్ క్యా హో..అంటూ సెటైర్లు వేస్తున్నారు. 15 రోజుల క్రితం విజయవాడ లో ఎన్నికల ప్రచారం (AP Election Campaign) చేస్తున్న సీఎం జగన్ (Jagan) ఫై సతీష్ అనే యువకుడు గులక రాయి తో దాడి (Stone Attack) చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి లో ఆ రాయి జగన్ ఎడమకంటి పైభాగంలో తగలడంతో అక్కడ గాయమైంది. అదే రాయి పక్కనున్న వెల్లంపల్లి కూడా తగలడంతో ఆయన కంటికి కూడా గాయమైంది.

దీంతో గత 15 రోజులుగా వారిద్దరూ బ్యాండెయిడ్‌(స్టిక్క‌ర్‌) లతో ప్రజల్లో తిరుగుతూ వస్తున్నారు. ఇక జగన్ బ్యాండెయిడ్‌ రోజు రోజుకు పెరుగుతుండడం తో ప్రతిపక్షాలు సెటైర్లు వేయడం..నెటిజన్లు ట్రోల్ల్స్ చేయడం మొదలుపెట్టారు. చిన్న గులకరాయి తగిలితే అంత బ్యాండెయిడ్‌ అవసరమా..ఏమన్నా నాటకం ఆడుతున్నారా..? అంటూ సెటైర్లు (Trolling)వేయడం స్టార్ట్ చేసారు. ఇక సోషల్ మీడియా లోను నెటిజన్లు జగన్ బ్యాండెయిడ్‌ ఫై మీమ్స్, వీడియోస్ చేస్తూ హల్చల్ చేస్తూ వస్తున్నాయి. మరి ఏమనున్నాడో ఏమో కానీ ఈరోజు బ్యాండెయిడ్‌ తీసి బయటకు వచ్చారు. అంతే బ్యాండెయిడ్‌ లేని జగన్ ను చూసి అంత ఆశ్చర్య పోవడం మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

జగన్ గాయం మాయమైందే..అంటూ సెటైర్లు వేయడం స్టార్ట్ చేసారు. అసలు అక్కడ గాయమే లేదుకదా..గాయం అయినట్లు అక్కడ కనిపించడమే లేదుకదా..ఇన్ని రోజులు సింపతీ కోసం ఆలా బ్యాండెయిడ్‌ వేసుకొని కనిపించాడా..? అని మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు. ఈ తరుణంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనదైన స్టయిల్ లో సెటైర్లు వేశారు. ప్రజల ట్రోలింగ్ దెబ్బకు జగన్ బ్యాండేజ్ మాయమైందంటూ లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్‌ ముఖంపై జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం అయ్యిందని ఎద్దేవా చేశారు. కోడి కత్తి కమల్ హాసన్ అంటూ జగన్ ఫోటోలను తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతలో లోకేశ్​ జత చేశారు.

Read Also : Chiranjeevi : పిఠాపురం ప్రచారానికి చిరంజీవి నిజంగా రాబోతున్నారా..?