Nara Lokesh React: జగన్ రెడ్డి పాలనలో జర్నలిజానికి సంకెళ్లు!

సీనియర్ జర్నలిస్టు అంకబాబు(73) అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ గుంటూరు సీఐడీ కార్యాలయం ఎదుట మౌన దీక్ష చేస్తున్న మహా న్యూస్

  • Written By:
  • Updated On - September 23, 2022 / 05:13 PM IST

సీనియర్ జర్నలిస్టు అంకబాబు(73) అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ గుంటూరు సీఐడీ కార్యాలయం ఎదుట మౌన దీక్ష చేస్తున్న మహా న్యూస్ ఎండీ వంశీకృష్ణతో పాటు ఇతర జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. జర్నలిస్టులు పోలీసులపై వ్యాఖ్యలు చేయగా, అరెస్టు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెసేజ్‌లు ఫార్వార్డ్ చేశారంటూ సీనియర్ జర్నలిస్టు అంకంబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు.

జగన్ రెడ్డి పాలనలో జర్నలిజానికి సంకెళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా చీకటి జీవో తీసుకొచ్చారని, ఇప్పుడు ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టి పాత్రికేయులను అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ పాత్రికేయులు అంకబాబు గారిని అరెస్ట్ చేయడమే అన్యాయం అనుకుంటే, ఇప్పుడు ఆయనకు మద్దతుగా గళం విప్పిన సాటి జర్నలిస్టులను వేధించడం ఇంకా దారుణం అని నారా లోకేశ్ అన్నారు. అంకబాబు అరెస్ట్ ని, పత్రికా స్వేచ్ఛని హరిస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహా టీవీ ఎండి వంశీ తో పాటు పలువురు జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే అరెస్ట్ చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.