Site icon HashtagU Telugu

Nara Lokesh: ఏపీ సంక్షేమం కోసమే ప్రజాగళం కూటమి ఏర్పాటు

Lokesh

Lokesh

Nara Lokesh  ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో కూటమి ఆధ్వర్యాన బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో కలిసి యువనేత రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… తిరుపతి అంటే అమర్ రాజా, అమర్ రాజా అంటే తిరుపతి. అలాంటి కంపెనీపై వేధింపులకు పాల్పడ్డారు. దీంతో వారు పక్క రాష్ట్రానికి వెళ్లి తమ ప్లాంట్ ను ఏర్పాటుచేసుకున్నారు. ఆ ఒక్క నిర్ణయం వల్ల ఇక్కడ 20వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. రాయలసీమకు నీళ్లిస్తే బంగారమే పండిస్తారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ తెలుగుగంగ ద్వారా నీరు పారించి బంగారం పండించారు. 2014 నుంచి ఇప్పటివరకు మోడీ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల బండిలాగా ముందుతు తీసుకెళ్లారు. మోడీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు నేను పంచాయితీ రాజ్, ఐటీ శాఖ మంత్రిగా చేశా. చంద్రబాబునాయుడు నాయకత్వంలో అనేక పరిశ్రమలు తిరుపతికి తీసుకువచ్చాం. ఆనాడు ఒక లక్ష్యంతో పనిచేశాం అని లోకేశ్ అన్నారు.

కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ఈ రోజు గర్వంగా చెబుతున్నా. ఇదే తిరుపతి కేంద్రంగా 50వేల మంది ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఒక ఫాక్స్ కాన్, సెల్ కాన్, టీసీఎస్, జోహో లాంటి అనేక పరిశ్రమలు తీసుకువచ్చి తిరుపతిలోనే కాదు.. రాయలసీమలో నిరుద్యోగ యువతీ, యువకులకు యుద్ధప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. వికసిత భారత్ మోడీ లక్ష్యం. వికసిత ఆంధ్రప్రదేశ్ చంద్రబాబునాయుడు, పవనన్న లక్ష్యం. పొత్తు కోసం మొదట త్యాగం చేసింది పవనన్న. ఈ రోజు ప్రజల తరపున పోరాడుతోంది మన పవనన్న. రాష్ట్రాన్ని, రాయలసీమను కాపాడుకునేందుకు ఈ ప్రజాగళం కూటమి ఏర్పడింది. మీకు అండగా నిలబడతాం. పెండింగ్ ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం అని నారా లోకేశ్ అన్నారు.