Anganwadi Workers Protest : అంగన్వాడీలపై పోలీసులు కర్కశత్వం ప్రదర్శించడం దారుణం – నారా లోకేష్

తమ డిమాండ్స్ ను సీఎం జగన్ (CM Jagan) పరిష్కరించాలని చెప్పి గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు (Anganwadi Workers) నిరసనలు , ఆందోళలనలు (Protest ) చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యహరిస్తుంది. అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా కార్యకర్తలు వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు అధికార ఎమ్మెల్యేల ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడిక్కడే వారిని అడ్డుకొని ..అదుపులోకి తీసుకోవడం చేసారు. […]

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh Responds Over Arresting Anganwadi Workers

Nara Lokesh Responds Over Arresting Anganwadi Workers

తమ డిమాండ్స్ ను సీఎం జగన్ (CM Jagan) పరిష్కరించాలని చెప్పి గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు (Anganwadi Workers) నిరసనలు , ఆందోళలనలు (Protest ) చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యహరిస్తుంది. అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా కార్యకర్తలు వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు అధికార ఎమ్మెల్యేల ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడిక్కడే వారిని అడ్డుకొని ..అదుపులోకి తీసుకోవడం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక పోలీసుల తీరు ఫై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేసారు. అంగన్వాడీలపై పోలీసులు కర్కశత్వం ప్రదర్శించడం దారుణమని ఆయన అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వర్కర్లను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లిపోవడం, బస్సులు ఎక్కించి తరలించడం జగన్ రెడ్డి నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు. ఈ మేరకు లోకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘15 రోజులుగా తమ న్యాయబద్ధమైన డిమాండ్లపై పోరాడుతున్న అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై వైసీపీ ప్రభుత్వం కొంచెం కూడా శ్రద్ధ పెట్టలేదు. వేతనాలు పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత వంటి పలు అంశాలను కోరుకున్న అంగన్వాడీలపై కర్కశత్వాన్ని ప్రదర్శించడం దుర్మార్గం. హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీలపై జగన్ రెడ్డి ఉక్కుపాదం మోపడం నిరంకుశత్వమే. శాంతియుతంగా నిరసనలు తెలుపుతూ.. తమ డిమాండ్లపై ప్రజా ప్రతినిధుల ఇళ్లకు వెళ్లి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అంగన్వాడీలకు లేవా? విజయవాడ ధర్నాచౌక్ లో నిరసన తెలిపేందుకు ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని అడ్డగోలుగా పీకేసి, అంగన్వాడీలను అక్రమంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో పడేసి అరెస్టు చేయడం జగన్ నియంతృత్వానికి నిదర్శనం. అంగన్వాడీ సోదరీమణుల న్యాయబద్ధమైన పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్ధతు ఉంటుంది. అంగన్వాడీ సోదరీమణుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని నారా లోకేష్ అన్నారు.

Read Also : Separate Seats for Men : బస్సులో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించే ఆలోచనలో TSRTC ..?

  Last Updated: 27 Dec 2023, 08:05 PM IST