Site icon HashtagU Telugu

Lokesh On Roads: ఏపీ రోడ్లపై చినజీయర్ సెటైర్లు.. పాలకులకు ఇప్పుడైనా అర్థమౌతోందా..?: లోకేశ్

Lokesh Padayatra

Lokesh Padayatra

ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని.. అధికార పార్టీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రోడ్ల దుస్థితిపై టీడీపీ, జనసేనలు నిరసనలు కూడా చేపట్టాయి. అంతేకాదు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఏపీ రోడ్లపై సెటైరికల్ కామెంట్స్ చేయడంతో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి కూడా ఏపీలో రోడ్ల పరిస్థితిపై తన ప్రవచనంలో కామెంట్స్ చేయడంతో అందరూ నవ్వుకున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.

రాష్ట్రంలో రోడ్లు నడిచేందుకు వీలుగా లేవని జనం గగ్గోలు పెడుతున్నారు. పక్కరాష్ట్ర పాలకులు ఆద్వాన్న పాలనకు ఏపీని ఉదాహరణగా చూపిస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. రాజకీయాలకు దూరంగా, ఆధ్యాత్మిక ప్రపంచానికి దగ్గర, హిందూ ధర్మ ప్రచారమే జీవితలక్ష్యంగా సాగుతోన్న చినజీయర్ స్వామి ఏపీలో రహదారుల దుస్థితిపై ఆవేదనతో స్పందించారని లోకేష్ పేర్కొన్నారు.

చినజీయర్ స్వామి ఏమన్నారు..
ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చినజీయర్ స్వామి ఏపీలోని జంగారెడ్డి గూడెం నుంచి రాజమండ్రికి రోడ్డు మార్గంలో ప్రయాణించారట. రాజమండ్రిలో ప్రవచనం చేస్తున్న సమయలో ఈ ప్రయాణం గురించి ప్రస్తావించాల్సి వచ్చింది. ప్రయాణం చేసేటప్పుడు ఒడిదొడుకులు ఉంటాయి. ఒక్కోసారి గోతులు కూడా ఉంటాయి.. కానీ జంగారెడ్డి గూడెం నుంచి ఇక్కడికి రావడానికి.. చాలా బాగుంది.. చక్కగా గుర్తుంచుకునేలా ఉంది.. అంటూ రోడ్ల దుస్థితిపై చెప్పకనే చెప్పారు. చినజీయర్ స్వామి ఈ వ్యాక్యలు చేస్తున్నంతసేపు ప్రవచనం వింటున్నవాళ్లు నవ్వుకున్నారు .

Exit mobile version