Nara Lokesh Padayatra : యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్ర

ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఎలక్షన్స్ లో గెలుపే లక్ష్యంగా పలు కార్యక్రమాలకు,

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh Padayatra

Lokesh

టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర (Nara Lokesh Padayatra)కు సిద్ధమయ్యారు. జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.. ఈ యాత్రకు ‘యువగళం’ (Yuva Galam) నామకరణం చేశారు. పాదయాత్రకు సంబంధించి లోగో, పేరును ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ కీలక నేతలు ఆవిష్కరించారు. నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర కుప్పంలో జనవరి 27న మొదలై ఇచ్చాపురం వరకు 400 రోజుల పాటూ 4వేల కిలోమీటర్లు కొనసాగనుంది. ఈ పాదయాత్ర 100 నియోజకవర్గాల్లో కొనసాగనుందని అచ్చెన్నాయుడు తెలిపారు. కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ పాదయాత్ర హంగు, ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. యువతతో పాటూ మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు అండగా పాదయాత్ర కొనసాగనుంది.

 

‘యువగళం’ పాదయాత్రలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ 96862 96862 కు మిస్ట్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా పాల్గొనవచ్చని తెలిపారు. నారా లోకేష్ పాదయాత్రలో వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. పాదయాత్రలు ఎవరు చేసినా ప్రభుత్వం ఆటంకం కల్పించకుండా సహకారం అందించాలన్నారు. తాము కూడా పాదయాత్రకు భద్రత కల్పించాలని.. ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ప్రభుత్వానికి లేఖలు రాస్తామన్నారు.. ఒకవేళ పాదయాత్రను ఇబ్బందిపెడితే తాము కూడా దేనికైనా సిద్ధమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్నట్లుగానే 400 రోజులు 4వేల కిలోమీటర్ల పాదయాత్రను నారా లోకేష్ పూర్తి చేస్తారన్నారు.

యువత, మహిళ, రైతు సమస్యలు ప్రతిబింబించేలా పాదయాత్ర ఉంటుంది అంటున్నారు. ఈ మూడన్నరేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు లేవని.. మహిళలకు భద్రత లేదన్నారు నేతలు. యువతకు భరోసా ఇవ్వడానికి, భవిష్యత్‌పై నమ్మకం కలిగించడానికి ఈ యువగళం దోహదపడుతుందన్నారు. అన్ని రంగాల సమస్యల్ని అధ్యయనం చేయడంతో పాటూ ఈ రాష్ట్ర భవిష్యత్ నిర్మాణానికి యువతను ఆహ్వానిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటూ యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రతో ఓ వైపు ప్రజలతో మమేకమవుతూనే.. అటు పార్టీని బలోపేతం చేయాలి అనుకుంటున్నారు.

Also Read:  PAN Card : మీరు ఇంకా మీ పాన్ కార్డ్‌ని మీ ఆధార్ కార్డ్‌తో లింక్ చేయలేదా?

  Last Updated: 28 Dec 2022, 01:21 PM IST