Lokesh Tour : ఉద్రిక్త‌తల‌ నడుమ లోకేష్ చిత్తూరు టూర్

చిత్తూరు వెళ్లిన నారా లోకేష్ కు అక్క‌డి క్యాడ‌ర్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. రేణిగుంట విమానాశ్ర‌యం నుంచి చిత్తూరు వెళుతోన్న సంద‌ర్భంగా రోడ్డు పొడ‌వునా కార్య‌క‌ర్త‌లు మోటారు సైకిళ్ల‌పై ర్యాలీగా వెళ్లారు. చిత్తూరు స‌బ్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ శ్రీనివాసుల‌తో పాటు న‌లుగురు స్థానిక లీడ‌ర్ల‌ను ప‌రామ‌ర్శించారు.

  • Written By:
  • Updated On - August 30, 2022 / 05:40 PM IST

చిత్తూరు వెళ్లిన నారా లోకేష్ కు అక్క‌డి క్యాడ‌ర్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. రేణిగుంట విమానాశ్ర‌యం నుంచి చిత్తూరు వెళుతోన్న సంద‌ర్భంగా రోడ్డు పొడ‌వునా కార్య‌క‌ర్త‌లు మోటారు సైకిళ్ల‌పై ర్యాలీగా వెళ్లారు. చిత్తూరు స‌బ్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ శ్రీనివాసుల‌తో పాటు న‌లుగురు స్థానిక లీడ‌ర్ల‌ను ప‌రామ‌ర్శించారు. వాళ్ల‌కు ధైర్యం చెప్ప‌డంతో పాటు భ‌రోసా ఇచ్చారు. ఆయ‌న ఒక రోజు ప‌ర్య‌ట‌న ఉద్రిక్త‌త న‌డుమ సాగింది. చంద్ర‌బాబు మూడు రోజుల కుప్పం టూర్ సంద‌ర్భంగా టీడీపీ నేత‌ల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ కేసులు పెట్టింది. వాళ్ల‌ను జైలుకు పంపించిన విష‌యం విదిత‌మే. వాళ్ల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి మంగ‌ళ‌వారం చిత్తూరు వెళ్లిన నారా లోకేష్ ప‌ర్య‌ట‌న కూడా ఉద్రిక్త‌త‌కు దారితీసింది.

కుప్పంలో చంద్ర‌బాబు ఉన్న‌ప్పుడే అన్న క్యాంటిన్ ను వైసీపీ కార్య‌క‌ర్త‌లు ధ్వంసం చేశారు. చిత్తూరు ప‌ర్య‌ట‌న‌కు లోకేష్ వ‌స్తున్న విష‌యం తెలుసుకుని మ‌రోసారి అన్న క్యాంటిన్ ను వైసీపీ క్యాడ‌ర్ ప‌గుల‌కొట్టింది. కుప్పం ఆర్టీసీ బస్టాండు జంక్షన్ దగ్గర 56 రోజులుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ పై వైసీపీ శ్రేణులు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అన్న క్యాంటీన్ల కూల్చివేత అంశాన్ని.. వచ్చే ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మార్చుకోవాలని తెలుగు దేశం పార్టీ భావిస్తోంది.మొన్న చంద్రబాబు పర్యటనను సైతం వైసీపీ నేతలు అడ్డుకున్నారు. లోకేష్ పర్యటనలో కూడా ఉద్రిక్తత నెల‌కొంది. దీంతో భారీగా కార్యకర్తలు, నేతలు మోహరిస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో పోలీసులు సైతం భారీ భద్రత ఏర్పాటు చేశారు.