Nara Lokesh: మహిళా దినోత్సవం వేళ తన సతీమణి నారా బ్రాహ్మణి గురించి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వివరాలను వెల్లడించారు. తన వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ విషయాల్లో బ్రాహ్మణి పాత్రే కీలకమైందని ఆయన తెలిపారు. చివరకు తన క్రెడిట్ కార్డు బిల్లులను కూడా బ్రాహ్మణియే చెల్లిస్తుందని లోకేష్ తెలిపారు. ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2025’లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు లోకేష్ సమాధానాలు చెప్పారు.
Also Read :Hair Transplant Capital : బట్ట తలలకు చికిత్స.. ఆ దేశమే నంబర్ 1
రెండోతరం వ్యాపారవేత్తలం
‘‘నేను, బ్రాహ్మణి మా కుటుంబంలో రెండోతరం వ్యాపారవేత్తలం. మా నాన్న నారా చంద్రబాబు నాయుడు 1990వ దశకంలో ఒక పాల కంపెనీని (హెరిటేజ్) ప్రారంభించారు. దాని మార్కెట్ విలువ దాదాపు రూ.4,500 కోట్లు. అది లిస్టెడ్ కంపెనీ. ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బ్రాహ్మణి సేవలు అందిస్తున్నారు. హెరిటేజ్ కంపెనీలో తన బాధ్యతలను ఆమె చాలా సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో ఆమె నుంచి నేను నేర్చుకోవలసింది చాలా ఉంది’’ అని లోకేష్ తెలిపారు.
Also Read :Rahul Gandhi : కాంగ్రెస్‌లోని బీజేపీ ఏజెంట్లను ఫిల్టర్ చేస్తాం : రాహుల్
బ్రాహ్మణికి ఇంకో కొడుకును నేనే
‘‘మాకు ఒకే ఒక్క కొడుకు దేవాంశ్(Nara Lokesh). అతన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అంతా బ్రాహ్మణీయే తీసుకుంటుంది. బ్రాహ్మణికి ఇంకో కొడుకు ఉన్నాడు. అది నేనే. ఆమె రోజూ సాయంత్రం నాకు ఫోన్ చేసి.. నా ఆరోగ్యం గురించి తెలుసుకుంటుంది. జాగ్రత్తలు చెబుతుంది’’ అని లోకేష్ చెప్పుకొచ్చారు. వృత్తిపరమైన, వ్యక్తిగతమైన కట్టుబాట్లను నిర్వహించడంలో పురుషుల కంటే మహిళలే చాలా బెటర్ అని ఆయన చెప్పారు. ‘‘మహిళా దినోత్సవాన్ని ఒకే రోజుకు పరిమితం చేయడం కరెక్ట్ కాదు. దాన్ని ప్రతిరోజూ జరుపుకోవాలి. వనితల పురోగతితోనే దేశ పురోగతి జరుగుతుంది’’ అని లోకేష్ పేర్కొన్నారు.