Yuvagalam Padayatra: ప్రజలకు చేరువయ్యేందుకు టీడీపీ యువగలం పేరుతో పాదయాత్ర ప్రారంభించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇటీవలే తన 100 రోజుల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. అయితే ఇటీవల లోకేష్ అస్వస్థకు గురయ్యారు. కుడి భుజం నొప్పితో బాధపడుతున్న లోకేష్ తన పాదయాత్రను ఆపలేదు. అయితే ఈ మధ్య నొప్పి ఎక్కువ అవ్వడంతో లోకేష్ ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన యువగలం పాదయాత్ర ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా లోకేష్ ప్రజలను కలుస్తూ వారికి చేరువవుతున్నారు. అయితే అంతకుముందు కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన లోకేష్ కి చేదు అనుభవం ఎదురైంది. కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో లోకేష్ స్వల్పంగా గాయపడ్డారు. కదిరిలో పాదయాత్ర చేస్తున్న సమయంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి లోకేష్ ని చూసేందుకు ఎగబడ్డారు. దీంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో లోకేష్ కుడి భుజానికి స్వల్పంగా గాయమైంది. అయినప్పటికీ లోకేష్ పాదయాత్ర కంటిన్యూ చేశారు. అయితే నేడు నంద్యాలలో లోకేష్ పాదయాత్ర చేయగా… నంద్యాలలో ఎంఆర్ఐ సెంటర్ కు వెళ్లి కుడి భుజానికి స్కానింగ్ తీయించుకున్నారు.
Read More: Jagan Delhi : ఢిల్లీ అపాయిట్మెంట్ నో, తాడేపల్లి వైపు సీబీఐ?
