Nara Lokesh: |ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా వేడెక్కాయి. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు కాగా ఇప్పుడు నారా లోకేష్ పై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై లోకేష్ పై యాక్షన్ తీసుకోనున్నారు. అయితే ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టుగా పేర్కొంటూ ఢిల్లీ పెద్దలతో లోకేష్ మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నారా లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. లోకేశ్ పాటు టీడీపీ ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు.
ప్రెసిడెంట్ తో లోకేష్ భేటీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సీఎం జగన్ పరిపాలన విధానాలు, అక్రమాలు, అన్యాయాలను రాష్ట్రపతితో లోకేష్ చెప్పారు. అలాగే చంద్రబాబు అరెస్టుపై కూడా రాష్ట్రపతికి తెలియజేశారు. కాగా లోకేష్ చెప్పిన విషయాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది.
Also Read: YS Sharmila: రాజకీయ చదరంగంలో షర్మిల.. విలీనంపై నో క్లారిటీ!