Site icon HashtagU Telugu

Nara Lokesh: బీసీ నాయ‌కుల‌తో లోకేష్ కీల‌క భేటీ

Nara Lokesh2

Nara Lokesh2

వెనుక‌బ‌డిన వ‌ర్గాల ఓటు బ్యాంకు జారిపోకుండా టీడీపీ జాగ్ర‌త్త ప‌డుతోంది. బీసీల్లోని ఉప కులాల లీడ‌ర్ల‌తో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. బీసీ సాధికార కమిటీ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. జగన్ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయ‌డానికి లోకేశ్ దిశానిర్దేశం చేశారు. ఉప కులాల వారీగా సమస్యల అధ్యయనం పై సమాలోచనలు జ‌రిపారు.

వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు స్థానిక సంస్థ‌ల్లో 34% రిజర్వేషన్లను టీడీపీ క‌ల్పించింది. ఆనాడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి బీసీల పార్టీగా టీడీపీకి పేరుంది. రిజ‌ర్వేష‌న్లు స్థానిక సంస్థ‌ల్లో 26 ఏళ్ల పాటు అమల్లో ఉండానికి కార‌ణం టీడీపీ. కానీ, బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌గ్గించిన విష‌యాన్ని టీడీపీ గుర్తు చేస్తూ బీసీ సాధికారిత కోసం ప్ర‌ణాళిక రచిస్తున్న‌ట్టు లోకేష్ వెల్ల‌డించారు.

వాల్మీకి , బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు టీడీపీ సర్కారు అప్ప‌ట్లో కేంద్రానికి తీర్మానం పంపింది. అధికారంలోకి వస్తే వాల్మీకుల్ని ఎస్టీల్లో చేర్చేందుకు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేస్తానని చెప్పిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. మూడున్నరేళ్ల తరువాత కమిషన్ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టార‌ని లోకేష్ అన్నారు. బీసీ కులాలకి జరుగుతున్న అన్యాయం, దాడులపై పోరాటం చేయాల‌ని లోకేష్ పిలుపు ఇచ్చారు.