Site icon HashtagU Telugu

Lokesh – NVIDIA CEO : జెన్సన్ హువాంగ్ తో నారా లోకేష్ భేటీ..

Lokesh Jensen Huang

Lokesh Jensen Huang

ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)..గురువారం ముంబయిలో ఎన్‌విడియా (NVIDIA ) సీఈఓ జెన్సన్ హువాంగ్‌ (Jensen Huang)తో సమావేశమయ్యారు. ఈ భేటీలో, ఏపీ పాలనా వ్యవహారాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి మెరుగైన సేవలను అందించడంపై చర్చించారు. అమరావతిలో ఏఐ యూనివర్సిటీ (AI University in Amaravati) ఏర్పాటుకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వమని హువాంగ్‌ను లోకేశ్ కోరారు.

దీనికి సానుకూలంగా స్పందించిన హువాంగ్.. రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తెచ్చే అవకాశాలను వివరించారు. ఎన్‌విడియా ఇప్పటికే స్పీచ్ రికగ్నిషన్, మెడికల్ ఇమేజింగ్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించడానికి కంప్యూటింగ్ పవర్ టూల్స్ మరియు అల్గారిథమ్‌లు అందిస్తుందన్నారు. ఇదిలా ఉంటె..నారా లోకేశ్ ఈ నెల 25వ తేదీ నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు కల్పించడం లక్ష్యంగా జరగనుంది. 29న లాస్‌వెగాస్‌లో జరుగనున్న ‘సినర్జీ’ అనే ఐటీ సర్వ్ అలయెన్స్ సమావేశానికి విశిష్ట అతిథిగా లోకేష్ హాజరుకానున్నారు. లోకేష్ పర్యటన వివరాలు చూస్తే..

25-10-2024 (శాన్‌ఫ్రాన్సిస్కో)

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ ప్రతినిధులతో భేటీ.
పెట్టుబడిదారులు, ఎంటర్ ఫ్రెన్యూర్స్‌తో సమావేశం.

26-10-2024 (శాన్‌ఫ్రాన్సిస్కో)

పత్ర, సినర్జీస్, బోసన్, స్పాన్ ఐఓ, క్లారిటీ సంస్థల ప్రతినిధులతో భేటీ.
భారత కాన్సులేట్ జనరల్‌తో భేటీ.
ఎడోబ్, స్కేలర్, జనరల్ అటమిక్స్ ప్రతినిధులతో సమావేశాలు.

27-10-2024 (ఆస్టిన్)

ఆస్టిన్‌లోని పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ.

28-10-2024 (శాన్‌ఫ్రాన్సిస్కో)

రెడ్ మండ్‌లో మైక్రో సాఫ్ట్ ప్రతినిధులతో భేటీ.

29-10-2024 (లాస్‌వెగాస్)

ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరు, అమెజాన్, రేవాచర్, సేల్స్ ఫోర్స్, పెప్సికో ప్రతినిధులతో భేటీలు.
ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో కీలకోపన్యాసం.

30-10-2024 (శాన్‌ఫ్రాన్సిస్కో)

గూగుల్ క్యాంపస్ సందర్శన.
స్టార్టప్స్, ఎంటర్ ప్రెన్యూర్స్‌తో భేటీ.
ఇండియన్ సిజి, కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం
సేల్స్ ఫోర్స్ కంపెనీ ప్రతినిధులతో భేటీ.

31-10-2024 (జార్జియా)

జార్జియా కుమ్మింగ్స్‌లోని శానిమౌంటేన్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.

1-11-2024 (న్యూయార్క్)

న్యూయార్క్‌లో పెట్టుబడిదారులతో సమావేశం.