Nara Lokesh : చేనేతల అభ్యున్నతికి బాధ్యత తీసుకుంటాన‌న్న నారా లోకేష్‌

చేనేతలను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా మెరుగైన స్థితిలో నిలపడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తానని తెలుగుదేశం

Published By: HashtagU Telugu Desk
TDP

TDP

చేనేతలను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా మెరుగైన స్థితిలో నిలపడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చేనేత కార్మికులు, చేనేత సామాజికవర్గ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చేనేతల ఆదాయం పెంచేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటానన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తాన‌ని.. ఉద్యోగులు, కార్మికులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి దేశమంతా పరిశీలించి మెరుగైన కార్యాచరణ రూపొందిస్తామ‌న్నారు. జగన్ రెడ్డి బటన్ నొక్కి పేదలను ఉద్దరిస్తున్నానని చెప్పుకుంటూ.. మరో బటన్ నొక్కి పేదల జేబులు ఖాళీ చేస్తున్నార‌ని లోకేష్ ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు పేదలను సొంత కాళ్లపై నిలబెట్టడం ద్వారానే శాశ్వత ప్రయోజనాలు సాకారమవుతాయని భావిస్తున్నారని… జగన్ రెడ్డికి ప్రజల ఆదాయం, రాష్ట్ర ఆదాయం పెంచడంపై కనీస శ్రద్ధ లేదన్నారు. అందుకే అప్పులు ఏకంగా రూ.12 లక్షల కోట్లకు చేరాయన్నారు. హ్యాండ్ లూమ్, పవర్ లూంను వేర్వేరుగా అభివృద్ధి చేయడానికి ఉన్న మార్గాలను పరిశీలించి ఆ దిశగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చేనేత రంగాన్ని ఆధునిక పద్దతులకు, ఆధునిక పరిస్థితులకు అనువుగా డిజైన్లపై శిక్షణ అవసరమన్నారు. డిజిటల్ కాలంలో మనం కూడా కాలానికనుగుణంగా పరుగులు పెట్టాలంటే, అందుకు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమ‌ని తెలిపారు. ఆ మేరకు ప్రోత్సాహం అందించి ఆంధ్రప్రదేశ్ చేనేత రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ఉండే అన్ని అవకాశాలను పరిశిస్తానని మాటిచ్చారు.

Also Read:  TDP : “గిరిజన ద్రోహి జగన్ రెడ్డి “పేరుతో కరపత్రం విడుదల చేసిన టీడీపీ

  Last Updated: 29 Dec 2023, 07:04 PM IST