Nara Lokesh Mark : విద్యా శాఖలో నారా లోకేష్ మార్క్

Nara Lokesh Mark : ఒక రాజకీయ నేత ఎప్పటికీ ప్రజలకు తన పనుల ద్వారా గుర్తుండాలి గానీ, ఫోటోలు, పార్టీ గుర్తులు, రంగులు మార్ఫింగ్ చేయడం ద్వారా కాదు. ఇది లోకేష్ విధానంలో స్పష్టంగా కనిపిస్తోంది

Published By: HashtagU Telugu Desk
Lokesh Mark

Lokesh Mark

‘పనిచేస్తూ ఎదగాలనే లక్ష్యం’తో నారా లోకేష్ (Nara Lokesh) తన మార్క్ (Mark) కొనసాగిస్తున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత ప్రచారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వకుండా పనివల్లనే గుర్తింపు రావాలని భావించే నేతల్లో ఆయన ముందున్నారు. ఒక రాజకీయ నేత ఎప్పటికీ ప్రజలకు తన పనుల ద్వారా గుర్తుండాలి గానీ, ఫోటోలు, పార్టీ గుర్తులు, రంగులు మార్ఫింగ్ చేయడం ద్వారా కాదు. ఇది లోకేష్ విధానంలో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యా రంగం (Education Sector)లో లోకేష్ చేస్తున్న మార్పులు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

నారా లోకేష్ విద్యను రాజకీయ ప్రభావం నుండి విముక్తం చేయాలనే లక్ష్యంతో కీలక మార్పులు తీసుకువచ్చారు. విద్యార్థులపై రాజకీయ ప్రభావం పడకుండా పాఠశాలల నిర్వహణలో నూతన విధానాలను అమలు చేస్తున్నారు. పాఠశాలల్లో పార్టీ గుర్తులు, నాయకుల ఫోటోలు లేకుండా విద్యార్థులకు స్వతంత్రంగా చదువు నేర్చుకునే వాతావరణాన్ని అందిస్తున్నారు. గతంలో పాఠశాలలు, యూనిఫాంలు, పుస్తకాలపై రాజకీయ గుర్తులను ముద్రించడం వల్ల విద్యార్థుల మనస్సుల్లో రాజకీయ ప్రేరణలు కలుగుతున్నాయి. కానీ ఇప్పుడు విద్యను రాజకీయ ప్రభావం నుండి దూరంగా ఉంచే విధానాన్ని తీసుకువచ్చారు.

భవిష్యత్తు పిల్లలదే – బాధ్యత ప్రభుత్వానిదే

విద్యార్థుల భవిష్యత్తును రాజకీయ స్వార్థాలకు బలి చేయకుండా, వారికి మంచి బోధనా విధానాన్ని అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉండాలి. నేటి పిల్లలే రేపటి సమాజాన్ని నిర్మించే పౌరులు. వారి భవిష్యత్‌ బాగుండేలా నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. విద్యార్ధులపై రాజకీయ ప్రభావం లేకుండా చేయడం ద్వారా వారు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఆలోచించగలగాలి. నారా లోకేష్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు తదుపరి తరాలకు ఉత్తమ మార్గదర్శకం అవుతున్నాయి. విద్యార్థులకు తమ స్వంత భవిష్యత్తును నిర్మించుకునే స్వేచ్ఛ కల్పించాలి. రాజకీయాల కంటే విద్యార్థి జీవితాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమై ఉండాలి అని లోకేష్ చెపుతున్నాడు. లోకేష్ తీసుకున్న నిర్ణయాల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Three-Language Policy : ఒక వ్యక్తి అనేక భాషలు నేర్చుకోవాలి..నాకు 8 భాషలు వచ్చు: సుధామూర్తి

  Last Updated: 12 Mar 2025, 05:13 PM IST