Site icon HashtagU Telugu

Nara Lokesh : శానసమండలిలో బొత్సపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం

Nara Lokesh Botsa

Nara Lokesh Botsa

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) పై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియా(YCP Social Media) అరెస్టులపై చర్చకు వైసీపీ(Ycp) పట్టుబడుతూ… చైర్మన్ పోడియంను చుట్టిముట్టి సభ్యులు ఆందోళన చేపట్టారు. ఫార్మాట్‌లో రావాలని చైర్మన్ ఎంత చెప్పినా వినకుండా నిరసన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ సభ్యుల తీరును తప్పుబడుతూ .. అసెంబ్లీ సాక్షిగా తన తల్లి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడంపై ఆయన శానసమండలిలో ప్రశ్నించారు. అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని నిలదీశారు. గతంలో తమ పార్టీకి సంఖ్యాబలం తక్కువ ఉన్నా చంద్రబాబు సభకు వచ్చారని , తన తల్లిని అవమానించిన తర్వాతనే చంద్రబాబు సభకు రాలేదని మంత్రి నారా లోకేశ్ గుర్తుచేశారు.

Read Also : Narendra Modi : ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం