Kuppam : జోరువానలోనూ నారా లోకేశ్ జోరు!

ఎక్కడయితే సమర్థవంతమైన నాయకత్వం ఉంటుందో.. అక్కడ మాత్రమే విజయం ఉంటుంది. కార్యకర్తలు నిరాశతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు.. పార్టీ మసక బారుతున్నపుడు సరికొత్త జోష్ నింపాలి.

Published By: HashtagU Telugu Desk

ఎక్కడయితే సమర్థవంతమైన నాయకత్వం ఉంటుందో.. అక్కడ మాత్రమే విజయం ఉంటుంది. కార్యకర్తలు నిరాశతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు.. పార్టీ మసక బారుతున్నపుడు సరికొత్త జోష్ నింపాలి. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇప్పుడే అదే పనిచేస్తున్నారు. ఏపీలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా.. అక్కడ నారా లోకేశ్ ప్రత్యక్షమై లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ఎందరో సీనియర్ నాయకులున్నా.. వాళ్లందరినీ వెనక్కి నెట్టి ప్రజల చూపు, ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడంలో లోకేశ్ ముందంజలో నిలుస్తున్నారు. పప్పు అనే ట్యాగ్ చెరిపేస్తూ.. తానోక ఫైటర్ అని నిరూపిస్తున్నారు.

తాజాగా నారా లోకేష్ కుప్పంలో పర్యటిస్తున్నారు. సామగుట్టపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఇంటి ఇంటి ప్రచారంలో పాల్గొని ఆబాలగోపాలాన్ని అలరిస్తున్నారు. లోకేష్ తో మాట్లాడేందుకు, చేయి కలిపేందుకు ఉత్సాహంగా కదిలొస్తున్నారు ప్రజలు. నారా లోకేష్ ను స్వాగతించేందుకు పూలబాట పరిచిన ప్రజలు…  విజయం మనదే అన్నట్టుగా రెండు వేళ్ళను చూపుతూ మహిళలు సైతం ఆనందోత్సహాలను ప్రదర్శిస్తున్నారు. నిన్న జరిగిన ప్రచారంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నారా లోకేశ్ జోరుగా ప్రచారం చేశారు.

కుప్పంలోని తంబిగానిపల్లి, అనిమిగానిపల్లి, వడ్డిపల్లి, సంపంగినగర్,డీకే పల్లి, మోడల్ కాలనీలలో జోరువానలో తడుస్తూనే నారా లోకేష్ రోడ్ షో నిర్వహించారు. ప్రజలు కూడా వానను లెక్కచేయక భారీగా హాజరయ్యారు. జోరు వర్షాన్ని సైతం తట్టుకొని పార్టీ కోసం ముమ్మరంగా పనిచేస్తున్న నారా లోకేశ్ ఫొటోలు కొన్ని వైరల్ గా మారాయి.

  Last Updated: 13 Nov 2021, 12:00 PM IST