Site icon HashtagU Telugu

Nara Lokesh : లోకేశ్ అరెస్ట్ కు రంగం సిద్ధం అయిందా?

Next Target Lokesh.... Cid Chief Signals!

Next Target Lokesh.... Cid Chief Signals!

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత ఆయ‌న కుమారుడు లోకేష్ కూడా అరెస్ట్ అవుతారంటూ వైసీపీ నేత‌లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత లోకేష్ పాద‌యాత్ర‌ను నిలిపివేశారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో లోకేష్ ప‌ర్య‌టిస్తున్నారు. పార్టీ ఎంపీల‌తో క‌లిసి ఢిల్లీలోనే ఆయ‌న మ‌కాం వేశారు. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌పై జాతీయ మీడియాకు లోకేష్ ఇంట‌ర్వూలు ఇచ్చారు. లీగ‌ల్‌గా ఎలా ప్రోసీడ్ అవ్వాల‌నే దానిపై సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాదుల‌తో నారా లోకేష్ చ‌ర్చించారు. అయితే రేపు కానీ ఎల్లుండి కాని నారా లోకేష్ అరెస్ట్ అవ్వుతారంటూ జోరుగా ప్ర‌చారం సాగుతుంది.ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ ఈ రాత్రికి రాజ‌మండ్రి చేరుకోనున్నారు. రాజ‌మండ్రికి రాగానే ఎయిర్‌పోర్టులోనే లోకేష్‌కి నోట‌సులు ఇచ్చి అదుపులోకి తీసుకోనున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. లోకేష్‌ని ఫైబ‌ర్ గ్రిడ్ కేసులో అరెస్ట్ చేస్తార‌ని స‌మాచారం. మరోవైపు ఇప్పుడే తొందరపడి లోకేశ్ ను అరెస్ట్ చేయరంటూ మరో ప్రచారం జ‌రుగుతుంది. చంద్రబాబు అరెస్ట్ తో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్ర‌జా వ్య‌తిరేక‌త వెల్లువెత్తుతుంది. ఈ నేప‌థ్యంలో లోకేష్‌ని అరెస్ట్ చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయని మదింపు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ వర్గాలు సమాయత్తమయ్యే అవకాశం ఉంది. ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరి అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారికి న్యాయస్థానాల్లో బెయిల్ కూడా ల‌భించింది.

Exit mobile version