Site icon HashtagU Telugu

Nara Lokesh : రాసలీలలు ఎక్కడ బయటపడతాయో అనే భయంలో విజయసాయి రెడ్డి – లోకేష్

Vijayasai Phone

Vijayasai Phone

నారా లోకేష్ (Nara Lokesh) మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఫై ఓ రేంజ్ లో విరుచుకపడ్డారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హోరు మొదలుకావడం తో వైసీపీ – టీడీపీ మధ్య వార్ రోజు రోజుకు వేడెక్కుతుంది. పబ్లిక్ సభల్లోనే కాదు సోషల్ మీడియా వేదికగా కూడా ఇరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case) గురించి మాట్లాడుకుంటున్నారు. మొన్నటివరకు నోటీసులతో సరిపెట్టిన ఈడీ అధికారులు ఇప్పుడు అరెస్ట్ వరకు వెళ్తున్నారు. గత వారం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయగా..నిన్న గురువారం ఏకంగా ఢిల్లీ సీఎం ను అరెస్ట్ చేసారు. అతి త్వరలో ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని సైతం అరెస్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫై పలు ఆరోపణలు చేసారు. నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఓ బ్రెజిల్ లో మీకున్న చీకటి వ్యాపారాల గురించి రెండేళ్ళ క్రిందటే చెప్పాను. ఇప్పుడు అదే నిజం అయ్యింది. అనే ట్యాగ్ లైన్ తో వీడియోని పోస్ట్ చేశారు. విజయసాయి లావాదేవీలు బయటపడతాయో.. లేక వైజాగ్ లో ఉన్న ఆయన రాసలీలలు బయటపడతాయో.. లేదంటే బ్రెజిల్ లో ఆయన, ఆయన కుటుంబసభ్యులు చేస్తున్న అవీనీతి బయటపడుతుందో, లేక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న ఈయన పాత్ర బయటపడుతుందో అనే భయం ఆయనకు పట్టుకుందని పేర్కొన్నారు.

అందుకే తన ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయసాయి రెడ్డి, దీనితో యావత్ ఆంధ్ర రాష్ట్ర పోలీసు డీజీపీ నుండి కానిస్టేబుల్ వరకు విజయసాయి రెడ్డి ఫోన్ వెతికే పనిలో పడ్డారని ఎద్దేవ చేశారు. ఒక రాజ్య సభ సభ్యుడు, జగన్మోహన్ రెడ్డికి చాల దగ్గర వ్యక్తి, అలానే అన్నీ కుంభకోణాల్లో నెంబర్ 2 ఈయనే.. అలాంటి వ్యక్తి ఫోన్ పోతే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అలోచాలి అన్నారు. వాస్తవంగా ఒక మాట చెప్పాలంటే దొంగోడి ఇంట్లో దొంగ పడినట్లు ఉంది అని ఎద్దేవ చేశారు. కాగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

Read Also : Rohit Sharma Friday Plan: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్రైడే ప్లాన్ ఇదే..!