అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ( Inner Ring Road Case)లో నోటీసులు అందుకున్న టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh).. ఈరోజు సిట్ విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిల్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్న లోకేష్.. ఉదయం 10.00 గంటల నుంచి లోకేశ్ ను సిట్ అధికారులు విచారిస్తుండగా..కొద్దీ సేపటి క్రితం భోజన విరామం ఇచ్చారు. విరామం ముందు వరకు దాదాపు గా మూడు గంటల పాటు పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ ల ఆధారంగా లోకేష్ పై సీఐడీ (CID) ప్రశ్నల వర్షం కురిపించింది. దీంతో పాటు.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు ముందే ఎలా తెలుసు..? మూడుసార్లు అలైన్మెంట్ మార్చడం వెనుక మీ పాత్ర ఉంది కదా? హెరిటేజ్ సంస్థకు లబ్ది చేకూర్చేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారు? హెరిటేజ్ సంస్థ ఆ ప్రాంతంలోనే ఎందుకు భూములు కొనుగోలు చేసింది..?
We’re now on WhatsApp. Click to Join.
2014 జులై 30న జరిగిన హెరిటేజ్ బోర్డు సమావేశంలో భూముల కొనుగోలుపై తీర్మానం చేశారు కదా..? లింగమనేని రమేష్ కి మీకు ఉన్న సంబంధం ఏంటి..? మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు పరిసరాల్లోనే భూములు ఎందుకు కొనుగోలు చేసారు..? చంద్రబాబు నుంచి రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు తెలిసిందా..? అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. ఇలా మొత్తం లోకేష్ ను సీఐడీ దాదాపు 16 అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. మరికాసేపట్లో మరోసారి లోకేష్ ను సీఐడీ విచారించనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు లోకేష్ ను విచారిస్తారు. ఈ విచారణ అంతా న్యాయవాది సమక్షంలోనే జరుగుతుంది. మరి CID అడిగిన ప్రశ్నలకు లోకేష్ ఎలాంటి సమాదానాలు ఇచ్చారు అనేది చూడాలి.
Read Also : Rat Milk – 18 Lakhs : లీటరు ఎలుక పాలు రూ.18 లక్షలు.. ఎందుకు ?