Site icon HashtagU Telugu

Lokesh Birthday : ఇది కదా లోకేష్ మానవత్వం అంటే..!!

Nara Lokesh Humanity

Nara Lokesh Humanity

మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) మరోసారి మానవత్వం చాటుకున్నారు. సాధారణంగా ఏ రాజకీయ నేతైనా తమ బర్త్ డే వచ్చిందంటే లక్షలు ఖర్చు చేసి పబ్లిసిటీ చేయించుకుంటారు. గుడి , బడి అనే తేడాలు లేకుండా తమ అభిమానులతో బర్త్ డే వేడుకలు జరుపుతూ ఉంటారు. కానీ లోకేష్ మాత్రం తన పుట్టిన రోజున చిన్నారులు తెలిపిన విషెష్ పట్ల తన స్పందనను తెలియజేసి ఇది కదా లోకేష్ మానవత్వం (Nara Lokesh HUMANITY) అంటే అని అంత మాట్లాడుకునేలా చేసారు.

జనవరి 23 న లోకేష్ బర్త్ డే (Lokesh Birthday). ఈ సందర్బంగా కూటమి శ్రేణులు , నేతలే కాదు ఇతర రాజకీయ పార్టీల నేతలు , బిజినెస్ , సినీ ప్రముఖులు సైతం లోకేష్ కు పెద్ద ఎత్తున విషెష్ తెలియజేసి వారి ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేసారు. ఇదే క్రమంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు వినూత్నంగా నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు “హ్యాపీ బర్త్‌డే లోకేష్ సార్” అని కనిపించేలా కూర్చున్నారు. విద్యా వ్యవస్థలో అనేక గొప్ప మార్పులు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రకంగా లోకేష్ కు విషెష్ తెలిపి వార్తల్లో నిలిచారు. ఇది చూసి చాలామంది వావ్..సూపర్..ఐడియా బాగుంది అంటూ ప్రశంసలు కురిపించారు.

ఇది చూసిన లోకేష్ చిన్నారుల ప్రేమాభిమానాలు తన మనసును హత్తుకున్నాయని…కాకపోతే ఇలాంటి కార్యక్రమం కోసం పిల్లల విలువైన సమయాన్ని వృధా చేయడం మంచిది కాదని..స్కూల్ మేనేజ్మెంట్‌కు విజ్ఞప్తి చేసారు. పిల్లల సమయాన్ని విద్య, సంస్కృతిక మరియు వ్యక్తిత్వ వికాసం వంటి ముఖ్యమైన కార్యకలాపాల కోసం వినియోగించాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు వికాసానికి అవసరమైన సమయం వారికి ఇవ్వడం చాలా ముఖ్యమని తెలిపారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలని స్కూల్ యాజమాన్యాన్ని కోరుతూ, తన కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ చేసిన ఈ ట్వీట్ ఎంతో ఆకట్టుకుంటుంది. మాములుగా లోకేష్ స్థానంలో వేరే నేత ఉంటె..శభాష్..బాగుంది..ఇలాంటివి మళ్లీ మళ్లీ చెయ్యండి అంటూ గొప్పగా చెపుతారు. కానీ లోకేష్ మాత్రం తనకు విషెష్ తెలిపినప్పటికీ , విద్యార్థుల చేత ఇలా చేయించడం మంచిది కాదని తెలిపి తన గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు.