వ‌చ్చే నెల నుంచి లోకేష్ పాద‌యాత్ర‌? తెలుగు యువ‌త లో జోష్ నింపేలా బ్లూప్రింట్

జ‌గ‌న్ ప్ర‌భుత్వంతో తాడోపేడో తేల్చుకోవ‌డానికి టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ లోకేష్ సిద్ధం అవుతున్నాడు. ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌పై ఫైట్ చేయడానికి క్షేత్ర స్థాయికి వెళ్ల‌నున్నారు. గ్రామ స్థాయిలో ప్ర‌జ‌ల్ని క‌ల‌వ‌డానికి పాద‌యాత్ర లేదా సైకిల్ యాత్ర‌కు టీడీపీ ప్లాన్ చేస్తోంది.

  • Written By:
  • Publish Date - September 21, 2021 / 03:26 PM IST

జ‌గ‌న్ ప్ర‌భుత్వంతో తాడోపేడో తేల్చుకోవ‌డానికి టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ లోకేష్ సిద్ధం అవుతున్నాడు. ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌పై ఫైట్ చేయడానికి క్షేత్ర స్థాయికి వెళ్ల‌నున్నారు. గ్రామ స్థాయిలో ప్ర‌జ‌ల్ని క‌ల‌వ‌డానికి పాద‌యాత్ర లేదా సైకిల్ యాత్ర‌కు టీడీపీ ప్లాన్ చేస్తోంది. అధిష్టానం తీసుకునే నిర్ణ‌యం మేర‌కు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌డానికి లోకేష్ టీం రెడీ అవుతోంది.
ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకుంటోంది. ప్ర‌తిప‌క్ష క్యాడ‌ర్ ఇళ్ల మీద దాడులు చేస్తోంది. తాజాగా హోం మంత్రి సుచిత్ర నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో జ‌రిగిన దాడుల్లో పోలీసులు కూడా గాయ‌ప‌డ్డారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఏపీ వ్యాప్తంగా ప‌లు చోట్ల చోటుచేసుకున్నాయి. వాటి మీద పోరాటం చేయ‌డంతో పాటు టీడీపీ క్యాడ‌ర్ కు మ‌నో ధైర్యం నింప‌డానికి లోకేష్ యాత్ర‌ల‌కు సిద్ధం అవుతున్నారు.
న‌వ‌ర‌త్నాల‌ను ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది. వాటి ల‌బ్దిదారుల సంఖ్య‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ క్ర‌మంలో వివిధ కార‌ణాల‌ను చూపుతూ రేష‌న్ కార్డులు, అమ్మ ఒడి త‌దిత‌ర ప‌థ‌కాల‌ను క‌ట్ చేస్తోంది. ఇంకో వైపు రైతుల‌కు ఇవ్వాల్సిన న‌గ‌దును ఇవ్వ‌లేక‌పోతోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద ఉన్న ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డానికి టీడీపీ కొత్త పంథాను ఎంచుకుంటోంది. లోకేష్ ను రంగంలోకి దింప‌డం ద్వారా యువ‌త‌కు నూత‌నోత్సాహం నింపే ప్ర‌య‌త్నం చేస్తోంది.
టీడీపీ వ‌ర్గాల నుంచి విశ్వ‌స‌నీయంగా అందుతోన్న స‌మాచారం మేర‌కు..వ‌చ్చే నెలాఖ‌రు నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌డానికి లోకేష్ సిద్ధం అవుతున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు ఎక్క‌డి నుంచైతే పాద‌యాత్ర ప్రారంభించారో..అక్క‌డి నుంచి మొద‌లుపెట్టాల‌ని యోచిస్తున్నారు. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ను రూపొందిస్తున్నార‌ని తెలిసింది. తొలుత కార్య‌క‌ర్త‌ల స‌మ‌న్వ‌య క‌మిటీ క‌న్వీన‌ర్ గా స‌మ‌ర్థ‌వంతంగా లోకేష్ ప‌నిచేశాడు. ఆ త‌రువాత మంత్రిగా ప్ర‌శంస‌లు అందుకున్నారు. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సంస్థాగ‌త నిర్మాణం చేయ‌డంలోనూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నారు. లోకేష్ నాయ‌క‌త్వంపై యువ‌త‌లో కొత్త ఆశ‌లు మొద‌లు అయ్యాయి. గ‌తంలో మాదిరిగా కాకుండా ఈసారి యువ‌త‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని విశ్వ‌సిస్తున్నారు. ఆ క్ర‌మంలో లోకేష్ పాద‌యాత్ర టీడీపీలో మ‌రో చ‌రిత్ర‌కు దారి వేస్తోంద‌ని యువ‌త భావిస్తోంది.