Nara Lokesh: అమ్మఒడి అబద్ధం.. నాన్నబుడ్డి నిజం!

ఏపీ ప్ర‌భుత్వంపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారాలోకేస్ ఫైర్ అయ్యారు. రైతులమోటార్లకు మీటర్లు బిగించేప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయాలనుకోవడం దారుణంమ‌ని ఆయ‌న తెలిపారు.

  • Written By:
  • Updated On - March 12, 2022 / 12:17 AM IST

ఏపీ ప్ర‌భుత్వంపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారాలోకేస్ ఫైర్ అయ్యారు. రైతులమోటార్లకు మీటర్లు బిగించేప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయాలనుకోవడం దారుణంమ‌ని ఆయ‌న తెలిపారు. పదేపదే నవరత్నాల జపంచేసే జగన్ రెడ్డి, వాటికి సంబంధించిన పథకాలకే నిధులు వెచ్చించలేని దుస్థితికి తన ప్రభుత్వాన్ని దిగజార్చార‌ని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు ప్రతి విద్యార్థికి అమ్మఒడి ఇస్తానన్న జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి తల్లికి అంటూ మెలికపెట్టారన్నారు. రాష్ట్రంలో 84లక్షల మంది వరకు విద్యార్థులుంటే, కేవలం 43లక్షల మందికి అమ్మఒడి ఇస్తున్నామని ప్రభత్వమే చెప్పిందన్నారు. అమ్మఒడికి గత ఏడాది రూపాయి కూడా కేటాయించలేదని అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ లోనే చెప్పారని తెలిపారు.

హాజరు పేరుతో విద్యార్థులకు అమ్మఒడి ఎగ్గొట్టే ప్రక్రియను కొనసాగిస్తున్నారని.. ప్రతి అవ్వాతాతకు, వికలాంగులు, వితంతువులకు రూ.3వేల పింఛన్ ఇస్తానన్న జగన్ రెడ్డి, దానికి కూడా పంగనామాలు పెట్టార‌న్నారు. అధికారంలోకి రాకముందు మూడు వేళ్లు చూపిస్తూ…. 3వేలు ఇస్తాననిచెప్పిన జగన్ రెడ్డి, తీరా ముఖ్యమంత్రి అయ్యాక ఏటా రూ.250 పెంచుకుంటూ పోతానని పింఛన్ దారులను దారుణంగా వంచించార‌ని ఆరోపించారు. తండ్రీకొడుకు కలిపి కేవలంరూ.650లు మాత్రమే పింఛన్ పెంచితే, ఎన్టీఆర్, చంద్రబాబు రూ.1850వరకు పింఛన్ పెంచార‌ని తెలిపారు.

జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలవరకు పింఛన్లను తొలగించార‌ని… అదీ టీడీపీ ప్రభుత్వానికి, ఇతర ప్రభుత్వాలకు ఉన్నతేడా అని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది వరకు డ్రైవర్లు ఉంటే, వివిధ రకాల కొర్రీలు పెట్టిన పెట్టిన ప్రభుత్వం వాహనమిత్ర పథకం కింద కేవలం లక్షా74వేల మందికి మాత్రమే గత సంవత్సరం సాయం చేసిందన్నారు. వాహనమిత్ర సాయం కేవలం వాహనాల యజమానులకేనంటూ కొత్తమెలిక పెట్టిన జగన్ రెడ్డి, సదరు పథకం కిందచేసిన సాయంకంటే ఎక్కువగా రవాణాశాఖా ధికారులు, పోలీసుల ద్వారా ఆటోవాలాల నుంచి రాబట్టార‌న్నారు.