AP : వృద్ధురాలి శవంతో వైసీపీ నీచ రాజకీయాలు – టీడీపీ ఆగ్రహం

వైసీపీ పార్టీకి శవ రాజకీయం చేయడం ఈరోజుది కాదని..2014 తండ్రి శవం, 2019 బాబాయ్ శవం , 2024 పెన్షనర్ శవం..వైసీపీ బతుకే ఫేక్

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 08:05 PM IST

వైసీపీ (YCP) పార్టీకి శవ రాజకీయం చేయడం ఈరోజుది కాదని..2014 తండ్రి శవం, 2019 బాబాయ్ శవం , 2024 పెన్షనర్ శవం..వైసీపీ బతుకే ఫేక్….ఆ పార్టీ డిఎన్ఏలోనే శవ రాజకీయం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh). ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్ దారులు నేరుగా ఆయా గ్రామ పంచాయితీల వద్దకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని ఈసీ తెలిపింది. దీంతో పెన్షన్ దారులు వారి వారి గ్రామ పంచాయితీల వద్ద పెన్షన్లు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వడదెబ్బకు వృద్ధురాలు మరణించిన ఘటన పెన‌మ‌లూరు మండలంలోని గంగూరు గ్రామంలో చోటుచేసుకుంది. దీనిని వైసీపీ అభ్యర్థి మంత్రి జోగి ర‌మేష్‌ క్యాష్ చేసుకోవాలని అనుకున్నాడు కానీ స్థానికులు రివర్స్ కావడంతో సైలెంట్ గా వెళ్లారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పెన‌మ‌లూరు మండలంలోని గంగూరు గ్రామంలో నివసించే వెంప‌టి వ‌జ్ర‌మ్మ ..పెన్షన్ కోసం స్థానిక సచివాలయానికి వెళ్లిన ఆమె దురదృష్టవశాత్తు ఎండ దెబ్బకు తాళ లేక మరణించింది. దీనిని క్యాష్ చేసుకోవాలని చెప్పి.. ఆమె పార్థవదేహాన్ని సందర్శించిన మంత్రి జోగి ర‌మేష్‌.. పూల మాలలు వేసి నివాళుల‌ర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత బాధితురాలి మృతదేహంతో చంద్రబాబు నివాసానికి వెళదామని కుటుంబ సభ్యులతో చెప్పడం తో.. చనిపోయిన బాధలో మీము ఉంటే మీ నీచ రాజకీయాలేంటి అంటూ జోగి రమేష్ పై బంధువులు..స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఓట్ల కోసం ఇలా వస్తావా అంటు.. జోగి రమేష్ అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ బాధితురాలి భంధువుల ఆందోళన చేయడం తో సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోయారు.

దీనిపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసారు. సహజంగా మరణించిన ఒక వృద్ధురాలి శవం ఇస్తే చంద్రబాబు గారి ఇంటికి వెళ్దాం అని డ్రామా ఆడిన జోగి రమేష్. జోగిని బండ బూతులు తిట్టి పంపించిన బంధువులు.

2014 తండ్రి శవం
2019 బాబాయ్ శవం
2024 పెన్షనర్ శవం
వైసీపీ బతుకే ఫేక్….ఆ పార్టీ డిఎన్ఏలోనే శవ రాజకీయం ఉంది అని ట్వీట్ చేసారు.