నాల్గు రోజులుగా సోషల్ మీడియా లో , అలాగే మీడియా చానెల్స్ లలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijaya Sai )..దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి ( Shanthi ) ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఎంపీ విజయసాయి రెడ్డి వల్ల తన భార్య శాంతి గర్భం దాల్చిందంటూ ఆమె భర్త మదన్ (Madan) సంచలన ఆరోపణలు చేయడం తో వారిద్దరూ ఆ వ్యాఖ్యలను ఖండించిన సంగతి తెలిసిందే. ఆదివారం మీడియా ముందు కన్నీరు పెట్టుకుంటూ..తన బిడ్డకు విజయసాయి కి సంబంధం లేదని , సుభాషే తన బిడ్డకు తండ్రి అని శాంతి తెలిపింది. ఇక విజయసాయి రెడ్డి కూడా తన ఫై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వీరిద్దరి వ్యాఖ్యల విన్న మదన్ మోహన్..విజయసాయి రెడ్డి కి DNA టెస్ట్ రావాలంటూ సవాల్ విసిరారు.
ఇదిలా ఉంటె నిన్న విజయసాయి రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో పలు మీడియా సంస్థలపై తీవ్ర పదజాలం వాడడం ఫై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రెస్ మీట్ లో విజయసాయి రెడ్డి వాడిన భాష తీవ్ర అభ్యంతరకరమని లోకేష్ పేర్కొన్నారు. ‘మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచీమర్యాదల గురించి చెప్పాల్సిన పనిలేదు. అధికారం పోయినా అహంకారం తగ్గలేదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు ఛీ కొట్టినా బుద్ధి రాలేదు’ అని ట్వీట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
అసలు విజయసాయి ఏమన్నాడంటే..
నా వ్యక్తిత్వం ఏంటి అన్న విషయం నాకు తెలుసు. రామోజీ రావు లాంటి వ్యక్తులను సైతం ఎదురించాను. సోషల్ మీడియాలో కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి నాపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. వారిని వదిలిపెట్టను. చట్టరీత్య చర్యలు తీసుకుంటాను.. ” త్వరలోనే నేను కొత్త ఛానెల్ ప్రారంభిస్తున్నా. గతంలో మా అధ్యక్షులు నిర్ణయం మేరకు ఛానెల్ ప్రారంభాన్ని వెన్నక్కి తీసుకున్నా. ఇప్పుడు ఎవ్వరు చెప్పినా తగ్గేది లేదు. కుల ఛానెల్స్, కుల పత్రికలను ఎండగడతాను. కులాలకు మతాలకు అతీతంగా ఈ ఛానెల్ ఉంటుంది. ఒక పార్టీకి మాత్రమే పనిచేయడం కాకుండా న్యూట్రల్‌గా ఉంటుంది” అని కొన్ని మీడియా సంస్థల పేర్లు , వ్యక్తుల పేర్లు చెపుతూ విజయసాయి రెడ్డి హెచ్చరించారు. దీనిపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
.@VSReddy_MP గారు! మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరం. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచీమర్యాదల గురించి చెప్పాల్సిన పనిలేదు. మీకు… pic.twitter.com/yVLSYe13RP
— Lokesh Nara (@naralokesh) July 16, 2024
Read Also : Rythu Runa Mafi : రుణమాఫీ ఫై తెలంగాణ రైతుల్లో అనుమానాలు తగ్గట్లే..