YS Jagan : సీఎం జ‌గ‌న్ కు అమెరికా కోర్టు సమ‌న్లు, లోకేష్ దావా

అమెరికా కోర్డులో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద దావా ఫైల్ అయింది. పెగాస‌స్ కుంభ‌కోణం, అవినీతి త‌దిత‌ర అంశాల‌ను కోడ్ చేస్తూ లోకేష్ ఉయ్యూరు 53 పేజీల పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

  • Written By:
  • Updated On - September 1, 2022 / 01:02 PM IST

అమెరికా కోర్డులో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద దావా ఫైల్ అయింది. పెగాస‌స్ కుంభ‌కోణం, అవినీతి త‌దిత‌ర అంశాల‌ను కోడ్ చేస్తూ లోకేష్ ఉయ్యూరు 53 పేజీల పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గౌతమ్ అదానిపైన దావా వేయ‌డం జ‌రిగింది.ఆ మేర‌కు అమెరికా న్యాయస్థానం వారందరికీ సమన్లను జారీ చేసింది.

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక సదస్సును నిర్వహించే వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఛైర్మన్ డాక్టర్ క్లాస్ ష్క్వాబ్ పేరు కూడా దావాలో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో కేసు నమోదైంది. జూన్ 22వ తేదీన కొలంబియా కోర్ట్ వారికి సమన్లు జారీ చేసింది. ఆగ‌స్ట్ 4వ తేదీన వారందరికీ సమన్లు అందాయి. అందుకున్నారు.

వర్జీనియా స్టేట్‌లోని రిచ్‌మండ్‌‌లో నివసించే డాక్టర్ లోకేష్ ఉయ్యూరు వేసిన దావా కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టులో న‌మోదు అయింది. ఆయన రిచ్ మండ్ లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా పని చేస్తోన్నారు. పెగాసస్ స్పైవేర్ కుంభకోణం, అవినీతిపై సాక్ష్యాధారాలను సమర్పించడానికి కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టు డాక్టర్ లోకేష్ ఉయ్యూరుకు ఆగస్టు 19వ తేదీ వరకూ సమయం ఇచ్చింది. న్యూయార్క్‌కు చెందిన ఇండియన్-అమెరికన్ అటార్నీ రవి బాత్రా తన వాదనలను వినిపించారు. డాక్టర్ లోకేష్ ఉయ్యూరు వేసిన దావాను తప్పుపట్టారు.
మూడు నెలల పాటు గడువు ఇచ్చినప్పటికీ సాక్ష్యాల‌ను అందజేయలేకపోయారని చెప్పారు. దీన్ని ఆయన డెడ్ ఆన్ అరైవల్ లా సూట్‌గా అభివర్ణించారు. కోరినంత గడువు ఇచ్చినప్పటికీ- పెగాసస్ స్పైవేర్, అవినీతిపై సరైన సాక్ష్యాధారాలను డాక్టర్ లోకేష్ ఉయ్యూరు న్యాయస్థానానికి సమర్పించలేకపోయారు. దీంతో ఆయ‌న అందజేసిన 53 పేజీల పిటీషన్ లోని ఆరోప‌ణ‌లు నిరాధార‌మ‌ని వాదించారు.

భారత్-అమెరికా మధ్య గల ఆర్థిక, దౌత్య, వాణిజ్యపరమైన సంబంధాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే డాక్టర్ లోకేష్ ఉయ్యూరు ఈ దావా వేసినట్లు భావించాల్సి వస్తోందని అటార్నీ రవి బాత్రా వ్యాఖ్యానించారు. ఎక్స్‌ట్రా టెరిటోరియల్ అండ్ ఫారిన్ సావరిన్ ఇమ్యూనిటీ యాక్ట్‌కు భిన్నంగా ఈ దావా వేసినట్లు చెప్పారు. డాక్టర్ లోకేష్ ఉయ్యూరు తరఫున వాదించడానికి ఏ న్యాయవాది కూడా అంగీకరించ‌లేదు. దీంతో ఆ దావాకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో స్పష్టం చేస్తోందని రవి బాత్రా చెప్పారు. దీన్నొక టాయ్‌లెట్ పేపర్ కంప్లైట్‌గా పేర్కొన్నారు.