ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (CM jagan)..సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించగా..ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ ఈసారి ఎలాగైనా వైసీపీ ఫై విజయం సాదించాలని కసిగా ఉంది. ఈ క్రమంలో జనసేన తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగబోతుంది.. ఇక ఇప్పుడు ఈ పొత్తుతో బిజెపి కూడా చేతులు కలిపేందుకు సిద్ధమైంది. దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఈ క్రమంలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. ఈనెల 11 నుంచి ‘‘శంఖారావం’’ పేరిట యువనేత ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) జరగని ప్రాంతాల్లో పర్యటించేలా లోకేష్ ప్రణాళికలు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి లోకేష్ శంఖారావం ప్రారంభంకానుంది. ఈ క్రమంలో ‘‘శంఖారావం’’పై రూపొందించిన ప్రత్యేక వీడియోను టీడీపీ గురువారం విడుదల చేసింది.
ప్రజాల్లోనూ, పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపటమే ‘‘శంఖారావం’’ లక్ష్యమని ఈ సందర్భంగా ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శంఖారావం కార్యక్రమానికి లోకేష్ సారథ్యం వహిస్తారన్నారు. ప్రతీ రోజూ మూడు నియోజకవర్గాల చొప్పున దాదాపు 50 రోజుల పాటు శంఖారావం పర్యటన సాగుతుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 11వ తేదీన ఉదయం 9 గంటలకు శంఖారావం తొలిసభ జరుగుతుందన్నారు.
Read Also : Janasena : మరో 10 రోజుల్లో జనసేన అభ్యర్థుల లిస్ట్ విడుదల